అభ్యాసమే గర్వం.. ప్రతిభే భవిష్యత్తు.!

నారాయణ స్కూల్‌లో ఘనంగా స్టూడెంట్‌ లెడ్‌ కాన్ఫరెన్స్‌.

అభ్యాసమే గర్వం.. ప్రతిభే భవిష్యత్తు.!

సత్తుపల్లి, అక్టోబరు 2 (తెలంగాణ ముచ్చట్లు):

పట్టణంలోని నారాయణ పాఠశాలలో ఒకటి, రెండు తరగతుల విద్యార్థుల కోసం స్టూడెంట్‌ లెడ్‌ కాన్ఫరెన్స్‌ (ఎస్‌ఎల్‌సీ) కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్నారులే వక్తలుగా మారి, తల్లిదండ్రుల సమక్షంలో తాము నేర్చుకున్న అంశాలను స్వయంగా వివరించి తమ ప్రతిభను చాటుకున్నారు. విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం, కమ్యూనికేషన్‌ నైపుణ్యాలు, నాయకత్వ లక్షణాలతో పాటు వేదికపై ధైర్యంగా మాట్లాడే సామర్థ్యాన్ని పెంపొందించడమే ఎస్‌ఎల్‌సీ ఉద్దేశమని పాఠశాల ప్రిన్సిపాల్‌ రామ్మూర్తి తెలిపారు. వివిధ కార్యకలాపాలు, ప్రదర్శనల ద్వారా విద్యార్థులు తమ అభ్యాసాన్ని తల్లిదండ్రులకు వివరించారు. చిన్నారుల చురుకుదనం, ఆత్మవిశ్వాసం, మాట్లాడే తీరు తల్లిదండ్రులను ఆకట్టుకుంది. కార్యక్రమానికి ఏజీఎం రాంకీ హాజరై విద్యార్థుల ప్రదర్శనలను తిలకించి అభినందించారు. ఆర్‌ఐ క్రాంతి, కోఆర్డినేటర్‌ వినోదలక్ష్మి పాల్గొని విద్యార్థులను ప్రోత్సహించారు. పాఠ్యపుస్తక జ్ఞానంతో పాటు విద్యార్థులు తమ ప్రతిభను స్వేచ్ఛగా వ్యక్తపరిచేలా అవకాశాలు కల్పించడం ద్వారా వారి సమగ్ర అభివృద్ధికి ఎస్‌ఎల్‌సీ వంటి కార్యక్రమాలు దోహదపడతాయని పాఠశాల యాజమాన్యం పేర్కొంది.

Tags:

Post Your Comments

Comments

Latest News

నవ తెలంగాణ పుస్తక భవన్‌ను సందర్శించిన జిల్లా విద్యాశాఖ అధికారి. నవ తెలంగాణ పుస్తక భవన్‌ను సందర్శించిన జిల్లా విద్యాశాఖ అధికారి.
వనపర్తి,అక్టోబర్02(తెలంగాణ ముచ్చట్లు): వనపర్తి జిల్లా కేంద్రంలోని రాజీవ్ చౌక్‌లో ఏర్పాటు చేసిన నవ తెలంగాణ పుస్తక భవన్‌ను జిల్లా విద్యాశాఖ అధికారి యాదయ్య సందర్శించారు. ఆయనతో పాటు...
సైబర్ మోసాలపై అప్రమత్తతే ఆయుధం.
గాంధీజీ అడుగుజాడల్లో నడవడం అందరి బాధ్యత… 
జమ్మికుంట ఫోటోగ్రాఫర్ విజయగిరి రాంబాబుకు జాతీయ స్థాయి పురస్కారం.
ఘనంగా కేవీపీఎస్ 29వ ఆవిర్భావ దినోత్సవం.
జమ్మికుంటలో తెలంగాణ రక్షణ సేన పార్టీ ఆధ్వర్యంలో గాంధీకి నివాళులు.
రాష్ట్ర పోలీస్ క్రీడల్లో ఏసీపీ మాధవి సత్తా ఐదు పతకాలు కైవసం.