ప్రభుత్వ ఆసుపత్రిలో నూతన క్యాంటీన్.
Views: 11
On
సత్తుపల్లి,అక్టోబరు 2(తెలంగాణ ముచ్చట్లు):
సత్తుపల్లి నూతన ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణంలో ఏర్పాటు చేసిన నూతన క్యాంటీన్‌ను ఎమ్మెల్యే మట్టా రాగమయి దయానంద్ శుక్రవారం ప్రారంభించారు. ఆసుపత్రికి వచ్చే రోగులు, వారి సహాయకులకు అందుబాటులో ఉండేలా క్యాంటీన్‌ను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే క్యాంటీన్‌ను పరిశీలించి, నిర్వహణకు సంబంధించిన వివరాలను తెలుసుకున్నారు. రోగులు, వారి సహాయకులకు ఇబ్బందులు లేకుండా నాణ్యమైన ఆహారాన్ని అందుబాటులో ఉంచడంతోపాటు క్యాంటీన్‌ను పరిశుభ్రంగా నిర్వహించాలని సూచించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రిహన బేగం కమల్ పాషా, ఏఎంసీ చైర్మన్ దోమ ఆనంద్, ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సభ్యులు మొరిశెట్టి సాంబశివరావు, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు గాదె చెన్నారావు, ఆసుపత్రి సూపరింటెండెంట్, వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
02 Oct 2026 21:01:17
వనపర్తి,అక్టోబర్02(తెలంగాణ ముచ్చట్లు):
వనపర్తి జిల్లా కేంద్రంలోని రాజీవ్ చౌక్‌లో ఏర్పాటు చేసిన నవ తెలంగాణ పుస్తక భవన్‌ను జిల్లా విద్యాశాఖ అధికారి యాదయ్య సందర్శించారు. ఆయనతో పాటు...


Comments