జమ్మికుంట ఫోటోగ్రాఫర్ విజయగిరి రాంబాబుకు జాతీయ స్థాయి పురస్కారం.

జాతీయస్థాయి వెడ్డింగ్ ఫోటోగ్రఫీ పోటీలో ‘సర్టిఫికెట్ ఆఫ్ మెరిట్’ సొంతం.

జమ్మికుంట ఫోటోగ్రాఫర్ విజయగిరి రాంబాబుకు జాతీయ స్థాయి పురస్కారం.

జమ్మికుంట, అక్టోబర్ 02 (తెలంగాణ ముచ్చట్లు):

ఫోటోగ్రఫీ రంగంలో జమ్మికుంటకు చెందిన విజయగిరి రాంబాబు జాతీయస్థాయిలో సత్తా చాటారు. సిగ్మా అకాడమీ ఆఫ్ ఫోటోగ్రఫీ ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయస్థాయి వెడ్డింగ్ ఫోటోగ్రఫీ పోటీలో ప్రతిష్ఠాత్మక ‘సర్టిఫికెట్ ఆఫ్ మెరిట్’ పురస్కారానికి ఎంపికయ్యారు. శుక్రవారం హైదరాబాద్‌లో నిర్వహించిన కార్యక్రమంలో సిగ్మా అకాడమీ ప్రధాన కార్యదర్శి కోరముళ్ల జనార్ధన్, వ్యవస్థాపక అధ్యక్షుడు ఎంసీ శేఖర్ చేతుల మీదుగా రాంబాబు ఈ పురస్కారాన్ని అందుకున్నారు.
ఇదే సందర్భంగా తెలంగాణ ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ సహకారంతో సిగ్మా అకాడమీ నిర్వహించనున్న ఫోటోగ్రఫీ ప్రదర్శనలో పాల్గొనేందుకు ‘సర్టిఫికెట్ ఆఫ్ ఎక్సలెంట్ ఎగ్జిబిటర్’ పురస్కారాన్ని సైతం రాంబాబు దక్కించుకున్నారు.
నాలుగు దశాబ్దాలుగా ఫోటోగ్రఫీలో ప్రత్యేక ముద్ర
దాదాపు నాలుగు దశాబ్దాలుగా ఫోటోగ్రఫీ వృత్తిలో కొనసాగుతున్న విజయగిరి రాంబాబు గిరిజనులు, ఆదివాసీల జీవనశైలి, తెలంగాణ సంస్కృతి–సంప్రదాయాలు, ప్రకృతి అందాలను తన కెమెరా ద్వారా ఆవిష్కరిస్తూ ప్రత్యేక గుర్తింపు పొందుతున్నారు. అరుదైన దృశ్యాలను సహజత్వాన్ని కోల్పోకుండా చిత్రీకరించడంలో ఆయనకు ప్రత్యేక శైలి ఉందని ఫోటోగ్రఫీ రంగానికి చెందిన వారు పేర్కొంటున్నారు.
గతంలో 2007, 2010 సంవత్సరాల్లో లంబాడీ జీవనశైలికి సంబంధించిన చిత్రాలతో జిల్లా స్థాయి పురస్కారాలు, 2011లో వరంగల్‌లో జరిగిన రాష్ట్రస్థాయి పోటీలో గుర్తింపు పొందారు. 2016లో ఖమ్మంలో నిర్వహించిన జాతీయస్థాయి ఫోటో వర్క్‌షాప్‌లో పర్యాటక విభాగంలో ద్వితీయ స్థానాన్ని సాధించారు.
అలాగే ఇటీవల కేబీఆర్ పార్కులో అటవీ శాఖ నిర్వహించిన ‘కెమెరా కళ్ళు’ ఫోటోగ్రఫీ పోటీలో రాష్ట్రస్థాయి ద్వితీయ బహుమతి, 187వ ప్రపంచ ఫోటోగ్రఫీ పోటీల్లో ఉమ్మడి తెలుగు రాష్ట్రాల స్థాయిలో తృతీయ బహుమతి సాధించారు.
జాతీయస్థాయిలో గుర్తింపు పొందిన విజయగిరి రాంబాIMG-20261002-WA0032బును పలువురు ఫోటోగ్రాఫర్లు, స్థానికులు అభినందించారు. ఫోటోగ్రఫీ రంగంలో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

నవ తెలంగాణ పుస్తక భవన్‌ను సందర్శించిన జిల్లా విద్యాశాఖ అధికారి. నవ తెలంగాణ పుస్తక భవన్‌ను సందర్శించిన జిల్లా విద్యాశాఖ అధికారి.
వనపర్తి,అక్టోబర్02(తెలంగాణ ముచ్చట్లు): వనపర్తి జిల్లా కేంద్రంలోని రాజీవ్ చౌక్‌లో ఏర్పాటు చేసిన నవ తెలంగాణ పుస్తక భవన్‌ను జిల్లా విద్యాశాఖ అధికారి యాదయ్య సందర్శించారు. ఆయనతో పాటు...
సైబర్ మోసాలపై అప్రమత్తతే ఆయుధం.
గాంధీజీ అడుగుజాడల్లో నడవడం అందరి బాధ్యత… 
జమ్మికుంట ఫోటోగ్రాఫర్ విజయగిరి రాంబాబుకు జాతీయ స్థాయి పురస్కారం.
ఘనంగా కేవీపీఎస్ 29వ ఆవిర్భావ దినోత్సవం.
జమ్మికుంటలో తెలంగాణ రక్షణ సేన పార్టీ ఆధ్వర్యంలో గాంధీకి నివాళులు.
రాష్ట్ర పోలీస్ క్రీడల్లో ఏసీపీ మాధవి సత్తా ఐదు పతకాలు కైవసం.