గాంధీజీ కలలు కన్న పచ్చని భారతాన్ని నిర్మిద్దాం.

పలుస శంకర్ గౌడ్, జిల్లా సాహితీ కళావేదిక అధ్యక్షులు .

గాంధీజీ కలలు కన్న పచ్చని భారతాన్ని నిర్మిద్దాం.

 వనపర్తి,అక్టోబర్02(తెలంగాణ ముచ్చట్లు):

మహాత్మా గాంధీజీ 157వ జయంతిని పురస్కరించుకుని వనపర్తి పట్టణంలోని ఎన్టీఆర్ లలిత కళా తోరణంలో యోగా మాస్టర్ ఓంకార్ ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సాహితీ కళా వేదిక వనపర్తి జిల్లా అధ్యక్షులు పలుస శంకర్ గౌడ్ హాజరై మొక్కలు నాటారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహాత్మా గాంధీజీ చూపిన సత్యం, అహింసా మార్గాలు నేటి యువతకు ఆదర్శమన్నారు. గాంధీజీ కలలు కన్న స్వచ్ఛమైన, పచ్చని భారతాన్ని నిర్మించేందుకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని పిలుపునిచ్చారు. పర్యావరణ పరిరక్షణ నేటి తరానికి ప్రధాన బాధ్యత అని, చెట్లను నరకడం కాకుండా విరివిగా మొక్కలు నాటి పెంచాలని సూచించారు.ప్రతి విద్యార్థి తన పుట్టినరోజు సందర్భంగా ఒక మొక్కను నాటి, దాని సంరక్షణ బాధ్యత తీసుకోవాలని కోరారు. పర్యావరణ పరిరక్షణతో పాటు సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న యోగా మాస్టర్ ఓంకార్ సేవలను ఆయన అభినందించారు. అనంతరం గాంధీజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ జి.జె. శ్రీనివాస్, యోగా మాస్టర్ ఓంకార్, డాక్టర్ శ్రీనివాస్, బాలరాజు, మల్లెల్ల శ్రీను, గంధం నాగరాజు, రామ్‌చంద్రుడు, ప్రశాంత్, సాహితీ కళా వేదిక సభ్యులు, కళాకారులు, విద్యార్థులు, ప్రజలు పాల్గొన్నారు. మాజీ కౌన్సిలర్ జి.జె. శ్రీనివాస్ పాల్గొన్న వారికి అల్పాహారం అందించారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

నవ తెలంగాణ పుస్తక భవన్‌ను సందర్శించిన జిల్లా విద్యాశాఖ అధికారి. నవ తెలంగాణ పుస్తక భవన్‌ను సందర్శించిన జిల్లా విద్యాశాఖ అధికారి.
వనపర్తి,అక్టోబర్02(తెలంగాణ ముచ్చట్లు): వనపర్తి జిల్లా కేంద్రంలోని రాజీవ్ చౌక్‌లో ఏర్పాటు చేసిన నవ తెలంగాణ పుస్తక భవన్‌ను జిల్లా విద్యాశాఖ అధికారి యాదయ్య సందర్శించారు. ఆయనతో పాటు...
సైబర్ మోసాలపై అప్రమత్తతే ఆయుధం.
గాంధీజీ అడుగుజాడల్లో నడవడం అందరి బాధ్యత… 
జమ్మికుంట ఫోటోగ్రాఫర్ విజయగిరి రాంబాబుకు జాతీయ స్థాయి పురస్కారం.
ఘనంగా కేవీపీఎస్ 29వ ఆవిర్భావ దినోత్సవం.
జమ్మికుంటలో తెలంగాణ రక్షణ సేన పార్టీ ఆధ్వర్యంలో గాంధీకి నివాళులు.
రాష్ట్ర పోలీస్ క్రీడల్లో ఏసీపీ మాధవి సత్తా ఐదు పతకాలు కైవసం.