విద్యార్థుల సమస్యలపై ఉద్యమబాట.

అక్టోబర్‌ 6న ఎంఎస్‌ఎఫ్‌ మహాసభ.

విద్యార్థుల సమస్యలపై ఉద్యమబాట.

ఎల్కతుర్తి, అక్టోబర్‌ 3 (తెలంగాణ ముచ్చట్లు): 

విద్యార్థుల సమస్యలు, హక్కులు, విద్యారంగానికి సంబంధించిన అంశాలపై చర్చించేందుకు అక్టోబర్‌ 6న హైదరాబాద్‌లోని ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్‌ కళాశాలలో నిర్వహించనున్న ఎంఎస్‌ఎఫ్‌ జాతీయ ప్రతినిధుల మహాసభను విజయవంతం చేయాలని ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షులు, పద్మశ్రీ మందకృష్ణ మాదిగ పిలుపునిచ్చారు.
ఎమ్మార్పీఎస్‌ ఎల్కతుర్తి మండల అధ్యక్షులు అడ్డూరి అనిల్‌ మాదిగ ఆదేశాల మేరకు శనివారం ఎల్కతుర్తి మండల కేంద్రంలో ఎంఎస్‌ఎఫ్‌ నాయకులు, విద్యార్థులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అక్టోబర్‌ 6న చేపట్టనున్న చలో హైదరాబాద్‌ కార్యక్రమానికి సంబంధించిన కార్యాచరణపై చర్చించారు.
ఎంఎస్‌ఎఫ్‌ ఎల్కతుర్తి మండల అధ్యక్షులు గొల్లమందల చరణ్‌ మాదిగ మాట్లాడుతూ విద్యార్థుల సమస్యలు, హక్కులు, విద్యారంగంలో ఎదురవుతున్న సమస్యలపై మహాసభలో చర్చించనున్నట్లు తెలిపారు. భవిష్యత్‌ కార్యాచరణను రూపొందించేందుకు నిర్వహిస్తున్న ఈ మహాసభకు ఎల్కతుర్తి మండలం నుంచి విద్యార్థులు పెద్ద సంఖ్యలో తరలివెళ్లాలని కోరారు.
అక్టోబర్‌ 6న మధ్యాహ్నం 2 గంటలకు ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్‌ కళాశాలలో జరిగే జాతీయ ప్రతినిధుల మహాసభకు మండలంలోని విద్యార్థులు, ఎంఎస్‌ఎఫ్‌ ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

మాజీ సర్పంచ్ సురవరం వేమారెడ్డి మృతి. మాజీ సర్పంచ్ సురవరం వేమారెడ్డి మృతి.
ఎల్కతుర్తి, అక్టోబర్ 3 (తెలంగాణ ముచ్చట్లు):  ఎల్కతుర్తి గ్రామ మాజీ సర్పంచ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు సురవరం వేమారెడ్డి (82) శనివారం హనుమకొండలో చికిత్స పొందుతూ...
మాట తప్పిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దె దించాలి.
పట్టభద్రులు ఓటర్లుగా నమోదు చేసుకోవాలి.
పండుగ ముందే రోడ్డు క్లియర్.
రెడ్డి జాగృతి మండల అధ్యక్షురాలిగా మంతెన సునీతారెడ్డి.
చలో వరంగల్‌ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి.
కార్మికుల సంక్షేమ పథకాలు వెంటనే అమలు చేయాలి.