మహానంది జాతీయ పురస్కార గ్రహీత ఊకంటి మహేందర్‌కు ఘన సన్మానం.

మహానంది జాతీయ పురస్కార గ్రహీత ఊకంటి మహేందర్‌కు ఘన సన్మానం.

జమ్మికుంట, అక్టోబర్ 03 (తెలంగాణ ముచ్చట్లు):

ఉద్యోగ రంగంలో అంకితభావంతో సేవలందిస్తూ, సహచర ఉద్యోగులకు మార్గదర్శకంగా నిలుస్తున్న జమ్మికుంట పోస్ట్‌మాస్టర్, అఖిల భారత తపాలా ఉద్యోగుల సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఊకంటి మహేందర్‌కు ప్రతిష్ఠాత్మక మహానంది జాతీయ పురస్కారం లభించడం పట్టణానికి గర్వకారణంగా నిలిచింది. ఈ సందర్భంగా శనివారం జమ్మికుంట స్థానిక పోస్టాఫీస్ కార్యాలయంలో పాత్రికేయులు మంద జగన్ ఆధ్వర్యంలో ఆయనను శాలువాతో ఘనంగా సన్మానించారు.
శ్రీ విరాట్ విశ్వకర్మ విజ్ఞాన ఆధ్యాత్మిక ధార్మిక కళాపరిషత్ జాతీయ సాహితీ, సాంస్కృతిక, సామాజిక సేవా సంస్థ ఆధ్వర్యంలో 2026 సంవత్సరానికి అందించిన తెలుగు వెలుగు సాహితీ వేదిక మహానంది జాతీయ పురస్కారానికి ఊకంటి మహేందర్ ఎంపికయ్యారు. ఉద్యోగ సేవా రంగంలో ఆయన కనబరిచిన అంకితభావం, సేవా దృక్పథం, సహచర ఉద్యోగులకు అందిస్తున్న మార్గదర్శకత్వాన్ని గుర్తించి ఈ పురస్కారాన్ని అందజేసినట్లు నిర్వాహకులు తెలిపారు.
ఈ సందర్భంగా పాత్రికేయులు మంద జగన్ మాట్లాడుతూ.. ఊకంటి మహేందర్‌కు జాతీయ స్థాయి పురస్కారం లభించడం జమ్మికుంట పట్టణానికి గర్వకారణమన్నారు. ఉద్యోగ బాధ్యతలను సమర్థంగా నిర్వర్తిస్తూ సహచరులకు మార్గనిర్దేశం చేయడం అభినందనీయమన్నారు. భవిష్యత్తులో ఆయన మరిన్ని ప్రతిష్ఠాత్మక పురస్కారాలు అందుకోవడంతో పాటు ఉద్యోగ రంగంలో ఉన్నత పదవులు అధిరోహించాలని ఆకాంక్షించారు.
కార్యక్రమంలో జమ్మికుంట మండల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అంబాల రాజు, పల్లవి రికార్డింగ్ స్టూడియో అధినేత మరముల్ల ప్రభు, జమ్మికుంట మండల కాంగ్రెస్ పార్టీ మైనార్టీ నాయకులు మహమ్మద్ సందాని తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

మాజీ సర్పంచ్ సురవరం వేమారెడ్డి మృతి. మాజీ సర్పంచ్ సురవరం వేమారెడ్డి మృతి.
ఎల్కతుర్తి, అక్టోబర్ 3 (తెలంగాణ ముచ్చట్లు):  ఎల్కతుర్తి గ్రామ మాజీ సర్పంచ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు సురవరం వేమారెడ్డి (82) శనివారం హనుమకొండలో చికిత్స పొందుతూ...
మాట తప్పిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దె దించాలి.
పట్టభద్రులు ఓటర్లుగా నమోదు చేసుకోవాలి.
పండుగ ముందే రోడ్డు క్లియర్.
రెడ్డి జాగృతి మండల అధ్యక్షురాలిగా మంతెన సునీతారెడ్డి.
చలో వరంగల్‌ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి.
కార్మికుల సంక్షేమ పథకాలు వెంటనే అమలు చేయాలి.