దుర్గ నవరాత్రి ఉత్సవాలకు సీపీ గౌస్‌ అలంకు ఆహ్వానం.

దుర్గ నవరాత్రి ఉత్సవాలకు సీపీ గౌస్‌ అలంకు ఆహ్వానం.

*టవర్‌ సర్కిల్‌ ఫ్రెండ్స్‌ యూత్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో వేడుకలు*

*సీపీ గౌస్‌ అలంను కలిసి ఆహ్వానపత్రం అందజేసిన సర్దార్‌ రవీందర్‌ సింగ్‌*

కరీంనగర్, అక్టోబర్ 3(తెలంగాణ ముచ్చట్లు ):

కరీంనగర్‌ టవర్‌ సర్కిల్‌లో ఫ్రెండ్స్‌ యూత్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ప్రతియేటా నిర్వహించే దుర్గ నవరాత్రి ఉత్సవాలకు హాజరు కావాలని కోరుతూ కరీంనగర్‌ మాజీ మేయర్‌, రాష్ట్ర సివిల్‌ సప్లయ్‌ కార్పొరేషన్‌ మాజీ చైర్మన్‌ సర్దార్‌ రవీందర్‌ సింగ్‌ పోలీస్‌ కమిషనర్‌ గౌస్‌ అలంను మర్యాదపూర్వకంగా కలిశారు.

యూత్‌ అసోసియేషన్‌ సభ్యులతో కలిసి సీపీని కలిసిన సర్దార్‌ రవీందర్‌ సింగ్‌.. దుర్గ నవరాత్రి ఉత్సవాల నిర్వహణకు సంబంధించిన వివరాలను వివరించి, కార్యక్రమానికి హాజరై అమ్మవారి ఆశీస్సులు పొందాలని కోరుతూ ఆహ్వానపత్రాన్ని అందజేశారు.

భక్తిశ్రద్ధలతో నిర్వహించే నవరాత్రి ఉత్సవాల్లో భక్తులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందాలని నిర్వాహకులు కోరారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

మాజీ సర్పంచ్ సురవరం వేమారెడ్డి మృతి. మాజీ సర్పంచ్ సురవరం వేమారెడ్డి మృతి.
ఎల్కతుర్తి, అక్టోబర్ 3 (తెలంగాణ ముచ్చట్లు):  ఎల్కతుర్తి గ్రామ మాజీ సర్పంచ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు సురవరం వేమారెడ్డి (82) శనివారం హనుమకొండలో చికిత్స పొందుతూ...
మాట తప్పిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దె దించాలి.
పట్టభద్రులు ఓటర్లుగా నమోదు చేసుకోవాలి.
పండుగ ముందే రోడ్డు క్లియర్.
రెడ్డి జాగృతి మండల అధ్యక్షురాలిగా మంతెన సునీతారెడ్డి.
చలో వరంగల్‌ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి.
కార్మికుల సంక్షేమ పథకాలు వెంటనే అమలు చేయాలి.