తాటికొండలో పోషణ్ మాస్ సందడి.
గర్భిణీలకు సామూహిక శ్రీమంతం.
Views: 0
On
స్టేషన్ ఘనపూర్,అక్టోబర్ 3 (తెలంగాణ ముచ్చట్లు):
స్టేషన్ ఘనపూర్ మండలంలోని తాటికొండ గ్రామంలో పోషణ్ మాస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. పోషకాహార లోపాన్ని నివారించడమే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పోషకాహారంపై అవగాహన పెంచుకోవాలని ఏసీడీపీఓ శోభారాణి అన్నారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పిల్లలు, గర్భిణీలు, బాలింతలకు అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందిస్తున్న పోషకాహారాన్ని తప్పనిసరిగా తీసుకోవాలని సూచించారు. సమతుల్య ఆహారంతో ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని అలవర్చుకోవాలని కోరారు.
అనంతరం గర్భిణీలకు సామూహిక శ్రీమంతం నిర్వహించారు. పోషకాహార ప్రాధాన్యతను వివరించేందుకు వివిధ రకాల పోషకాహార వంటకాల ప్రదర్శన చేపట్టారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ సుజనా శ్రీనివాస్, అంగన్వాడీ టీచర్లు పద్మ, ధనలక్ష్మి, సులోచన, లలిత, అరుణాదేవి, ఏఎన్‌ఎం నాగరాణి తదితరులు పాల్గొన్నారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
03 Oct 2026 21:35:47
ఎల్కతుర్తి, అక్టోబర్ 3 (తెలంగాణ ముచ్చట్లు):
ఎల్కతుర్తి గ్రామ మాజీ సర్పంచ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు సురవరం వేమారెడ్డి (82) శనివారం హనుమకొండలో చికిత్స పొందుతూ...


Comments