ఎంఈఓ శాంతన్నకు జర్నలిస్టు బండి రాజు శుభాకాంక్షలు.

ఎంఈఓ శాంతన్నకు జర్నలిస్టు బండి రాజు శుభాకాంక్షలు.

పెద్దమందడి,అక్టోబర్03(తెలంగాణ ముచ్చట్లు):

వనపర్తి జిల్లా పెద్దమందడి మండల విద్యాధికారిగా నూతన బాధ్యతలు చేపట్టిన శాంతన్నను జర్నలిస్టు బండి రాజు మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించి, పుష్పగుచ్ఛం అందజేసి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా బండి రాజు మాట్లాడుతూ పెద్దమందడి మండలంలో విద్యారంగ అభివృద్ధికి మరింత ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు మెరుగైన మౌలిక వసతులు, అవసరమైన విద్యా సౌకర్యాలు అందేలా అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని ఆకాంక్షించారు.విద్యార్థుల విద్యాభివృద్ధితో పాటు ఉపాధ్యాయులకు అవసరమైన సహకారం అందిస్తూ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలను మరింత మెరుగుపరిచే దిశగా ఎంఈఓ శాంతన్న కృషి చేయాలని కోరారు. మండలంలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల హాజరు, విద్యా ప్రమాణాలు, మౌలిక సదుపాయాలపై నిరంతర పర్యవేక్షణ కొనసాగించాలని సూచించారు.నూతన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూ పెద్దమందడి మండల విద్యాభివృద్ధిలో శాంతన్న తనదైన ముద్ర వేయాలని బండి రాజు ఆకాంక్షించారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, ప్రజలతో సమన్వయం చేసుకుంటూ మండలంలో విద్యారంగాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని కోరుతూ శుభాకాంక్షలు తెలిపారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

మాజీ సర్పంచ్ సురవరం వేమారెడ్డి మృతి. మాజీ సర్పంచ్ సురవరం వేమారెడ్డి మృతి.
ఎల్కతుర్తి, అక్టోబర్ 3 (తెలంగాణ ముచ్చట్లు):  ఎల్కతుర్తి గ్రామ మాజీ సర్పంచ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు సురవరం వేమారెడ్డి (82) శనివారం హనుమకొండలో చికిత్స పొందుతూ...
మాట తప్పిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దె దించాలి.
పట్టభద్రులు ఓటర్లుగా నమోదు చేసుకోవాలి.
పండుగ ముందే రోడ్డు క్లియర్.
రెడ్డి జాగృతి మండల అధ్యక్షురాలిగా మంతెన సునీతారెడ్డి.
చలో వరంగల్‌ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి.
కార్మికుల సంక్షేమ పథకాలు వెంటనే అమలు చేయాలి.