ఎస్సీ కమిషన్‌లో మాదిగ జర్నలిస్టులకు అవకాశం కల్పించాలి.

సందెల రాజుతెలంగాణ మాదిగ జర్నలిస్ట్ ఫోరం హన్మకొండ జిల్లా ఇంచార్జి.

ఎస్సీ కమిషన్‌లో మాదిగ జర్నలిస్టులకు అవకాశం కల్పించాలి.

హన్మకొండ, అక్టోబర్ 3 (తెలంగాణ ముచ్చట్లు): 

ఎస్సీ కమిషన్‌ చైర్మన్‌, సభ్యుల నియామకాల్లో రొటేషన్‌ పద్ధతిని అమలు చేసి, మాదిగలతో పాటు ఎస్సీ ఉపకులాలకు చెందిన అర్హులైన జర్నలిస్టులకు అవకాశం కల్పించాలని తెలంగాణ మాదిగ జర్నలిస్ట్ ఫోరం హన్మకొండ జిల్లా ఇంచార్జి సందెల రాజు కోరారు.
ఎస్సీ వర్గాల సమస్యలను సమర్థవంతంగా ప్రజల దృష్టికి తీసుకెళ్తున్న జర్నలిస్టులకు ఎస్సీ కమిషన్‌లో ప్రాతినిధ్యం కల్పించడం ద్వారా ఆయా వర్గాల సమస్యలపై మరింత అవగాహన, చర్చకు అవకాశం ఏర్పడుతుందని అన్నారు.ఎస్సీ కమిషన్‌ నియామకాల్లో ప్రభుత్వం సామాజిక న్యాయం, సముచిత ప్రాతినిధ్యానికి ప్రాధాన్యత ఇవ్వాలని సందెల రాజు విజ్ఞప్తి చేశారు. మాదిగలతో పాటు ఎస్సీ ఉపకులాలకు చెందిన అర్హత, అనుభవం కలిగిన జర్నలిస్టులను కమిషన్‌లో భాగస్వాములను చేయాలని ఆయన కోరారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

మాజీ సర్పంచ్ సురవరం వేమారెడ్డి మృతి. మాజీ సర్పంచ్ సురవరం వేమారెడ్డి మృతి.
ఎల్కతుర్తి, అక్టోబర్ 3 (తెలంగాణ ముచ్చట్లు):  ఎల్కతుర్తి గ్రామ మాజీ సర్పంచ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు సురవరం వేమారెడ్డి (82) శనివారం హనుమకొండలో చికిత్స పొందుతూ...
మాట తప్పిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దె దించాలి.
పట్టభద్రులు ఓటర్లుగా నమోదు చేసుకోవాలి.
పండుగ ముందే రోడ్డు క్లియర్.
రెడ్డి జాగృతి మండల అధ్యక్షురాలిగా మంతెన సునీతారెడ్డి.
చలో వరంగల్‌ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి.
కార్మికుల సంక్షేమ పథకాలు వెంటనే అమలు చేయాలి.