కనుల పండుగగా.. వెంకన్న కల్యాణం
ఆధ్యాత్మిక శోభతో చిల్పూర్ గుట్ట ఆలయం
గోవింద నామస్మరణలతో భక్తుల సందడి
చిల్పూర్,అక్టోబర్ 3 (తెలంగాణ ముచ్చట్లు):
తెలంగాణ తిరుపతిగా పేరుగాంచిన చిల్పూర్ గుట్ట బుగులు వెంకటేశ్వర స్వామి ఆలయంలో శనివారం వార కల్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. మంగళవాయిద్యాలు, వేదపండితుల మంత్రోచ్ఛారణల మధ్య స్వామివారి కల్యాణ మహోత్సవం కనుల పండుగగా సాగింది.స్వామివారికి, అమ్మవారికి నిర్వహించిన కల్యాణోత్సవాన్ని తిలకించిన భక్తులు ఆధ్యాత్మిక ఆనందంలో మునిగిపోయారు. “గోవిందా.. గోవిందా” అంటూ భక్తులు చేసిన నామస్మరణలతో చిల్పూర్ గుట్ట మారుమోగింది.
జనగామ, వరంగల్, హైదరాబాద్ ప్రాంతాలతో పాటు చుట్టుపక్కల జిల్లాల నుంచి వేలాది మంది భక్తులు ఆలయానికి తరలివచ్చారు. భక్తుల రాకతో ఆలయ పరిసరాలు సందడిగా మారాయి. కల్యాణ మహోత్సవం అనంతరం భక్తులకు అన్నప్రసాద వితరణ నిర్వహించారు.ఈ పవిత్ర కార్యక్రమంలో ఆలయ చైర్మన్ పొట్లపల్లి శ్రీధర్‌రావు, ఈవో లక్ష్మీప్రసన్న, ప్రధాన అర్చకులు రవీందర్ శర్మ, సౌమిత్రి శ్రీరంగాచార్యులు, కృష్ణమాచార్యులు, ఆలయ సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.


Comments