నూతన ఎంఈఓ శాంతన్నకు ఘన సన్మానం.

నూతన ఎంఈఓ శాంతన్నకు ఘన సన్మానం.

పెద్దమందడి,అక్టోబర్03(తెలంగాణ ముచ్చట్లు): 

పెద్దమందడి మండల నూతన మండల విద్యాశాఖ అధికారిగా (ఎంఈఓ) బాధ్యతలు చేపట్టిన శాంతన్నను వార్డు సభ్యులు ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయనను శాలువాతో సత్కరించి ఆత్మీయంగా అభినందనలు తెలియజేశారు.ఈ సందర్భంగా నూతన ఎంఈఓ శాంతన్న మాట్లాడుతూ.. పెద్దమందడి మండల విద్యాశాఖ అధికారిగా బాధ్యతలు చేపట్టడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. మండలంలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలను మరింత మెరుగుపరిచేందుకు కృషి చేస్తానని తెలిపారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందేలా ఉపాధ్యాయులు, ప్రజాప్రతినిధులు, తల్లిదండ్రుల సహకారంతో ముందుకు సాగుతానని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు సింగిరెడ్డి అమల, కురుమూర్తి, కొమ్ము బ్రహ్మయ్య, కొమ్ము విష్ణు తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

మాజీ సర్పంచ్ సురవరం వేమారెడ్డి మృతి. మాజీ సర్పంచ్ సురవరం వేమారెడ్డి మృతి.
ఎల్కతుర్తి, అక్టోబర్ 3 (తెలంగాణ ముచ్చట్లు):  ఎల్కతుర్తి గ్రామ మాజీ సర్పంచ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు సురవరం వేమారెడ్డి (82) శనివారం హనుమకొండలో చికిత్స పొందుతూ...
మాట తప్పిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దె దించాలి.
పట్టభద్రులు ఓటర్లుగా నమోదు చేసుకోవాలి.
పండుగ ముందే రోడ్డు క్లియర్.
రెడ్డి జాగృతి మండల అధ్యక్షురాలిగా మంతెన సునీతారెడ్డి.
చలో వరంగల్‌ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి.
కార్మికుల సంక్షేమ పథకాలు వెంటనే అమలు చేయాలి.