ఆరోగ్యవంతమైన తరం కోసం పోషకాహారంపై ప్రత్యేక శ్రద్ధ.

అంగన్వాడీ పోషణ మాసం కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ దిలీప్.

ఆరోగ్యవంతమైన తరం కోసం పోషకాహారంపై ప్రత్యేక శ్రద్ధ.

జమ్మికుంట, అక్టోబర్ 03 (తెలంగాణ ముచ్చట్లు):

తల్లులు ఆరోగ్యంగా ఉంటేనే పిల్లలు బలంగా, ఆరోగ్యవంతంగా ఎదిగి భవిష్యత్ తరానికి బలమైన పునాది ఏర్పడుతుందని జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ దిలీప్ అన్నారు. శనివారం జమ్మికుంట పట్టణ పరిధిలోని కేవీకేలో నిర్వహించిన అంగన్వాడీ పోషణ మాసం కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు.
గర్భిణులు, బాలింతలు, చిన్నారుల ఆరోగ్యం, పోషకాహారంపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతోందన్నారు. తల్లులు, చిన్నారుల్లో పోషకాహార లోపాలను నివారించడంతో పాటు ఆరోగ్యంపై అవగాహన పెంచేందుకు అంగన్వాడీ కేంద్రాల ద్వారా నిరంతరం కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. చిన్నారులు ఆరోగ్యంగా పెరిగితే భవిష్యత్తులో వైద్య ఖర్చులు తగ్గడంతో పాటు విద్య, అభివృద్ధి రంగాల్లో మెరుగైన ఫలితాలు సాధించే అవకాశం ఉంటుందన్నారు.
అంగన్వాడీ కేంద్రాల ద్వారా ప్రభుత్వం అందిస్తున్న పోషకాహారం, ఇతర సేవలను అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. తమకు అందాల్సిన ప్రయోజనాల విషయంలో ఎలాంటి సంకోచం లేకుండా అంగన్వాడీ టీచర్లు, ఆయాలు, సంబంధిత అధికారులు, కౌన్సిలర్లను సంప్రదించాలని కోరారు. ప్రభుత్వం అందించే పోషకాహారాన్ని సద్వినియోగం చేసుకుని ఆరోగ్యవంతమైన పిల్లలను తీర్చిదిద్దడంలో తల్లిదండ్రులు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ ముంతాజ్ అలీ జావేద్, ఎంపీడీవో, అంగన్వాడీ టీచర్లు, ఆయాలు, చిన్నారులతల్లులు తదితరులు పాల్గొన్నారు.IMG-20261003-WA0036

Tags:

Post Your Comments

Comments

Latest News

మాజీ సర్పంచ్ సురవరం వేమారెడ్డి మృతి. మాజీ సర్పంచ్ సురవరం వేమారెడ్డి మృతి.
ఎల్కతుర్తి, అక్టోబర్ 3 (తెలంగాణ ముచ్చట్లు):  ఎల్కతుర్తి గ్రామ మాజీ సర్పంచ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు సురవరం వేమారెడ్డి (82) శనివారం హనుమకొండలో చికిత్స పొందుతూ...
మాట తప్పిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దె దించాలి.
పట్టభద్రులు ఓటర్లుగా నమోదు చేసుకోవాలి.
పండుగ ముందే రోడ్డు క్లియర్.
రెడ్డి జాగృతి మండల అధ్యక్షురాలిగా మంతెన సునీతారెడ్డి.
చలో వరంగల్‌ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి.
కార్మికుల సంక్షేమ పథకాలు వెంటనే అమలు చేయాలి.