కార్మికుల సంక్షేమ పథకాలు వెంటనే అమలు చేయాలి.

కార్మికుల సంక్షేమ పథకాలు వెంటనే అమలు చేయాలి.

లేబర్‌ కార్డుదారులకు రూ.5 వేల పింఛన్‌ ఇవ్వాలి

ఈఎస్‌ఐ ఆస్పత్రి సౌకర్యం కల్పించాలి

– బీఎన్‌ఆర్‌కేఏఎస్‌ రాష్ట్ర ప్రచార కార్యదర్శి నల్ల స్వామి

హైదరాబాద్‌,అక్టోబర్‌ 3 (తెలంగాణ ముచ్చట్లు): 

రాష్ట్రంలోని భవన నిర్మాణ రంగ కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం మరిన్ని చర్యలు తీసుకోవాలని బీఎన్‌ఆర్‌కేఏఎస్‌ రాష్ట్ర ప్రచార కార్యదర్శి నల్ల స్వామి కోరారు. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, కార్మిక శాఖ మంత్రి వివేక్‌ వెంకటస్వామికి ఆయన విజ్ఞప్తి చేశారు.లేబర్‌ కార్డు కలిగిన ప్రతి కార్మికుడికి సంవత్సరానికి ఒకసారి ఉచితంగా రక్త పరీక్షలు నిర్వహించేందుకు ప్రభుత్వం కల్పించిన సదుపాయాన్ని కొందరు దుర్వినియోగం చేస్తున్నారని నల్ల స్వామి ఆరోపించారు. గ్రామాల్లో కార్మికుల అవసరం లేకున్నా రక్త నమూనాలు సేకరిస్తూ, సరైన చిరునామా, ఓపీ చీటీ, వైద్యులు, అర్హత కలిగిన సిబ్బంది లేకుండా సేవలు అందిస్తున్నారంటూ ఆయన విమర్శించారు. ఈ వ్యవహారంపై ప్రభుత్వం సమగ్రంగా విచారణ జరిపి, నిబంధనలకు విరుద్ధంగా పనిచేస్తున్న సంస్థలపై చర్యలు తీసుకోవాలని కోరారు.

అర్హులైన ప్రతి కార్మికుడికి 55 ఏళ్లు నిండిన అనంతరం నెలకు రూ.5 వేల పింఛన్‌ సౌకర్యం కల్పించాలని డిమాండ్‌ చేశారు. అలాగే ప్రతి ఉమ్మడి జిల్లాకు ఒక ఈఎస్‌ఐ ఆస్పత్రి ఏర్పాటు చేయాలని కోరారు. కార్మికుడు జీవించి ఉన్నంతకాలం లేబర్‌ కార్డు చెల్లుబాటయ్యేలా నిబంధనల్లో మార్పులు చేయాలని సూచించారు.ఉపాధి హామీ కూలీలను వెల్ఫేర్‌ బోర్డు పరిధి నుంచి తొలగించాలని, పెండింగ్‌లో ఉన్న లబ్ధిదారుల ఫైళ్లను వెంటనే పరిష్కరించి సంక్షేమ పథకాల ప్రయోజనాలను నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయాలని కోరారు. కార్మికుల సంక్షేమం కోసం వెల్ఫేర్‌ బోర్డు చైర్మన్‌ను కూడా తక్షణమే నియమించాలని నల్ల స్వామి ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

మాజీ సర్పంచ్ సురవరం వేమారెడ్డి మృతి. మాజీ సర్పంచ్ సురవరం వేమారెడ్డి మృతి.
ఎల్కతుర్తి, అక్టోబర్ 3 (తెలంగాణ ముచ్చట్లు):  ఎల్కతుర్తి గ్రామ మాజీ సర్పంచ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు సురవరం వేమారెడ్డి (82) శనివారం హనుమకొండలో చికిత్స పొందుతూ...
మాట తప్పిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దె దించాలి.
పట్టభద్రులు ఓటర్లుగా నమోదు చేసుకోవాలి.
పండుగ ముందే రోడ్డు క్లియర్.
రెడ్డి జాగృతి మండల అధ్యక్షురాలిగా మంతెన సునీతారెడ్డి.
చలో వరంగల్‌ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి.
కార్మికుల సంక్షేమ పథకాలు వెంటనే అమలు చేయాలి.