ఎస్సీ కమిషన్‌లో మాదిగ జర్నలిస్టులకు ప్రాతినిధ్యం కల్పించాలి.
కాటేపాగ హుస్సేన్, తెలంగాణ మాదిగ జర్నలిస్టు ఫోరం రాష్ట్ర ఉపాధ్యక్షుడు.
వనపర్తి,అక్టోబర్03(తెలంగాణ ముచ్చట్లు):
ఎస్సీ కమిషన్ చైర్మన్, సభ్యుల నియామకాల్లో రొటేషన్ విధానాన్ని అమలు చేసి మాదిగ, మాదిగ ఉపకులాలకు చెందిన అర్హులైన జర్నలిస్టులకు అవకాశం కల్పించాలని తెలంగాణ మాదిగ జర్నలిస్టు ఫోరం (టీఎంజేఎఫ్) డిమాండ్ చేసింది.ఈ సందర్భంగా టీఎంజేఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు కాటేపాగ హుస్సేన్ మాదిగ మాట్లాడుతూ.. రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ పదవీకాలం ముగిసిన నేపథ్యంలో త్వరలో చేపట్టనున్న నూతన నియామకాల్లో జర్నలిస్టు రంగానికి చెందిన అర్హులకు చైర్మన్, సభ్యులుగా అవకాశం కల్పించాలని కోరారు. ఇప్పటివరకు రాజకీయ ప్రాతిపదికన జరిగిన ఎంపికలకు భిన్నంగా రొటేషన్ విధానాన్ని అమలు చేసి వివిధ సామాజిక వర్గాలకు ప్రాతినిధ్యం కల్పించాలని విజ్ఞప్తి చేశారు.ముఖ్యంగా మాదిగ, మాదిగ ఉపకులాలకు చెందిన అర్హులైన జర్నలిస్టులకు కమిషన్‌లో ప్రాతినిధ్యం కల్పించాలని కోరారు. ఈ డిమాండ్‌ను ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు, మంత్రుల దృష్టికి తీసుకెళ్లేందుకు రాష్ట్రవ్యాప్తంగా వినతిపత్రాల సమర్పణ కార్యక్రమాన్ని చేపట్టినట్లు కాటేపాగ హుస్సేన్ మాదిగ తెలిపారు.


Comments