చలో వరంగల్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి.
బహుజన్ సమాజ్ పార్టీ నాయకుల పిలుపు.
హుజురాబాద్,అక్టోబర్ (తెలంగాణ ముచ్చట్లు ):
బహుజన్ సమాజ్ పార్టీ (బి ఎస్ పి) వ్యవస్థాపకులు మాన్యశ్రీ కాన్షీరాం 20వ వర్ధంతిని పురస్కరించుకుని అక్టోబర్ 20న వరంగల్‌లో నిర్వహించనున్న “చలో వరంగల్–బహుజన్ రాజ్యాధికార సమరభేరి” కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని బి ఎస్ పి హుజురాబాద్ నియోజకవర్గ అధ్యక్షుడు గిన్నారపు మహేందర్ పిలుపునిచ్చారు.
హుజురాబాద్‌లోని పార్టీ కార్యాలయంలో జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశానికి పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, అడ్వకేట్ పల్లి ప్రశాంత్‌గౌడ్ ముఖ్య అతిథిగా హాజరై పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బహుజన సమాజానికి రాజకీయ సాధికారత కల్పించడమే లక్ష్యంగా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
బహుజనులకు రాజ్యాధికారం దక్కేలా ప్రతి కార్యకర్త కృషి చేయాలని, ప్రజల్లో పార్టీ సిద్ధాంతాలు మరియు బహుజన హక్కులపై అవగాహన కల్పించాలని పిలుపునిచ్చారు. ఎన్నికల సమయంలోనే కాకుండా నిరంతరం ప్రజా సమస్యలపై పనిచేస్తూ బహుజనుల హక్కుల కోసం పోరాడాలని సూచించారు.
వరంగల్‌లో నిర్వహించనున్న “సమరభేరి” సభకు పెద్ద సంఖ్యలో బహుజనులు తరలివచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నాయకులు కోరారు.
ఈ కార్యక్రమంలో బి ఎస్ పి జిల్లా ఉపాధ్యక్షుడు మండె సమ్మయ్య, నియోజకవర్గ ఇన్‌చార్జులు అంజాల ప్రభాకర్, వేయిల మల్లేష్, నాయకులు కండె తిరుపతి, రాంరాజేశ్వర్, రామ్ శ్రీనివాస్, ఎడునూరి రమేష్, అచ్చుత్, తునికి భాస్కర్, శ్రీకాంత్, రఘు తదితరులు పాల్గొన్నారు.


Comments