బీజేవైఎం జిల్లా అధికార ప్రతినిధిగా తౌటి రెడ్డి రాజేశ్వర్‌రెడ్డి.

బీజేవైఎం జిల్లా అధికార ప్రతినిధిగా తౌటి రెడ్డి రాజేశ్వర్‌రెడ్డి.

స్టేషన్‌ ఘనపూర్‌,అక్టోబర్‌ 3 (తెలంగాణ ముచ్చట్లు): 

బీజేవైఎం జనగామ జిల్లా అధికార ప్రతినిధిగా తౌటి రెడ్డి రాజేశ్వర్‌రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు జిల్లా బీజేపీ అధ్యక్షులు సౌడ రమేష్‌, బీజేవైఎం జిల్లా అధ్యక్షులు అల్లబోయిన హరీష్‌ ఉత్తర్వులు జారీ చేశారు.తనపై నమ్మకంతో జిల్లా అధికార ప్రతినిధిగా బాధ్యతలు అప్పగించిన పార్టీ అధిష్టానానికి రాజేశ్వర్‌రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ బలోపేతానికి పూర్తి సమయం కేటాయించి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని అన్నారు.
తన నియామకానికి సహకరించిన రాష్ట్ర నాయకులు బొజ్జపెల్లి సుభాష్‌, ఎన్నారై సెల్‌ కో-కన్వీనర్‌ దాస్యం అభినవ్‌ భాస్కర్‌, జిల్లా ప్రధాన కార్యదర్శి అంజిరెడ్డి, మండల అధ్యక్షులు సట్ల వెంకటరమణ గౌడ్‌, గాజుల సంపత్‌లకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

మాజీ సర్పంచ్ సురవరం వేమారెడ్డి మృతి. మాజీ సర్పంచ్ సురవరం వేమారెడ్డి మృతి.
ఎల్కతుర్తి, అక్టోబర్ 3 (తెలంగాణ ముచ్చట్లు):  ఎల్కతుర్తి గ్రామ మాజీ సర్పంచ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు సురవరం వేమారెడ్డి (82) శనివారం హనుమకొండలో చికిత్స పొందుతూ...
మాట తప్పిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దె దించాలి.
పట్టభద్రులు ఓటర్లుగా నమోదు చేసుకోవాలి.
పండుగ ముందే రోడ్డు క్లియర్.
రెడ్డి జాగృతి మండల అధ్యక్షురాలిగా మంతెన సునీతారెడ్డి.
చలో వరంగల్‌ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి.
కార్మికుల సంక్షేమ పథకాలు వెంటనే అమలు చేయాలి.