రైతుల సమస్యపై ఎమ్మెల్యే మేఘారెడ్డి స్పందన.

రైతుల సమస్యపై ఎమ్మెల్యే మేఘారెడ్డి స్పందన.

పెద్దమందడి,అక్టోబర్‌03(తెలంగాణ ముచ్చట్లు):

సాగునీటి ప్రవాహం సన్నగిల్లడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతుల సమస్యపై వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి స్పందించారు. పెద్దమందడి మండలం పామిరెడ్డిపల్లి వద్ద బుద్ధారం కాల్వకు రెండో గూనా ఏర్పాటు చేసేందుకు జేసీబీతో పనులు ప్రారంభించారు.బుద్ధారం కాల్వ ద్వారా అల్వాల, మంగంపల్లి, చిన్నమందడి, సోలీపూర్‌ గ్రామాలకు సాగునీరు అందుతోంది. పామిరెడ్డిపల్లి వద్ద ఒకే గూనా ఉండటంతో నీటి ప్రవాహం మందగించి చెరువులకు నీరు సక్రమంగా చేరడం లేదని అల్వాల గ్రామస్థులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. దీంతో స్పందించిన ఎమ్మెల్యే సహకారంతో రెండో గూనా ఏర్పాటుకు తవ్వకం పనులు చేపట్టారు.రెండో గూనా ఏర్పాటు పూర్తయితే నీటి ప్రవాహం మెరుగుపడి అల్వాల, చిన్నమందడి తదితర గ్రామాల చెరువులకు నీరు త్వరగా చేరుతుందని రైతులు తెలిపారు. వర్షాలు ఆశించిన స్థాయిలో లేక పంటలకు నీటి కొరత ఏర్పడిన నేపథ్యంలో ఈ చర్యతో పంటలను కాపాడుకునే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.సమస్యను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లిన వెంటనే స్పందించినందుకు రైతులు మేఘారెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో అల్వాల కాంగ్రెస్‌ నాయకుడు జి. సుదర్శన్‌రెడ్డి, ఉపసర్పంచ్‌ సుజాత భీమన్న, చిన్నమందడి సర్పంచ్‌ స్వరూప, స్వామి, పలువురు రైతులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

మాజీ సర్పంచ్ సురవరం వేమారెడ్డి మృతి. మాజీ సర్పంచ్ సురవరం వేమారెడ్డి మృతి.
ఎల్కతుర్తి, అక్టోబర్ 3 (తెలంగాణ ముచ్చట్లు):  ఎల్కతుర్తి గ్రామ మాజీ సర్పంచ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు సురవరం వేమారెడ్డి (82) శనివారం హనుమకొండలో చికిత్స పొందుతూ...
మాట తప్పిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దె దించాలి.
పట్టభద్రులు ఓటర్లుగా నమోదు చేసుకోవాలి.
పండుగ ముందే రోడ్డు క్లియర్.
రెడ్డి జాగృతి మండల అధ్యక్షురాలిగా మంతెన సునీతారెడ్డి.
చలో వరంగల్‌ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి.
కార్మికుల సంక్షేమ పథకాలు వెంటనే అమలు చేయాలి.