పీఆర్‌టీయూ టీఎస్ మండల కార్యవర్గం ఏకగ్రీవ ఎన్నిక.

మండల అధ్యక్షుడిగా వేణుగోపాల్ రెడ్డి, ప్రధాన కార్యదర్శిగా  గోపాల్.

పీఆర్‌టీయూ టీఎస్ మండల కార్యవర్గం ఏకగ్రీవ ఎన్నిక.

పెద్దమందడి,అక్టోబర్03(తెలంగాణ ముచ్చట్లు):

పీఆర్‌టీయూ టీఎస్ పెద్దమందడి మండల శాఖ నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మండల అధ్యక్షుడిగా ఎ. వేణుగోపాల్ రెడ్డి, ప్రధాన కార్యదర్శిగా ఎన్. గోపాల్, గౌరవ అధ్యక్షుడిగా జె. శివారెడ్డి, ఉపాధ్యక్షుడిగా తిరుమలేష్ చారిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. వీరితో పాటు మరో పది మంది సభ్యులతో మండల కార్యవర్గాన్ని ఏర్పాటుచేశారు.IMG-20261003-WA0014ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన కార్యవర్గ సభ్యులకు పలువురు శుభాకాంక్షలు తెలిపారు. ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి కృషి చేయడంతో పాటు వారి హక్కులు, సంక్షేమం కోసం ఐక్యంగా పనిచేయాలని నాయకులు సూచించారు. మండలంలోని ఉపాధ్యాయుల సమస్యలను ఎప్పటికప్పుడు గుర్తించి, వాటి పరిష్కారానికి కృషి చేయాలని ఆకాంక్షించారు.ఈ ఎన్నికల కార్యక్రమానికి పీఆర్‌టీయూ టీఎస్ జిల్లా అధ్యక్షులు ఎం. బౌద్ధ రెడ్డి, జిల్లా గౌరవ అధ్యక్షులు రవీందర్ గౌడ్, రాష్ట్ర సంఘం సభ్యులు రాంచంద్రయ్య సాగర్, ప్రసాద్, గోపాల్‌పేట మండల అధ్యక్షులు మురళీధర్ రెడ్డి, ఘనపూర్ మండల అధ్యక్షులు శ్రీనివాస్ యాదవ్, నీతిన్ తదితరులు హాజరయ్యారు.నూతన కార్యవర్గం ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తూ, విద్యారంగ అభివృద్ధికి తోడ్పడాలని ఈ సందర్భంగా నాయకులు ఆకాంక్షించారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

మాజీ సర్పంచ్ సురవరం వేమారెడ్డి మృతి. మాజీ సర్పంచ్ సురవరం వేమారెడ్డి మృతి.
ఎల్కతుర్తి, అక్టోబర్ 3 (తెలంగాణ ముచ్చట్లు):  ఎల్కతుర్తి గ్రామ మాజీ సర్పంచ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు సురవరం వేమారెడ్డి (82) శనివారం హనుమకొండలో చికిత్స పొందుతూ...
మాట తప్పిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దె దించాలి.
పట్టభద్రులు ఓటర్లుగా నమోదు చేసుకోవాలి.
పండుగ ముందే రోడ్డు క్లియర్.
రెడ్డి జాగృతి మండల అధ్యక్షురాలిగా మంతెన సునీతారెడ్డి.
చలో వరంగల్‌ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి.
కార్మికుల సంక్షేమ పథకాలు వెంటనే అమలు చేయాలి.