పట్టభద్రులు ఓటర్లుగా నమోదు చేసుకోవాలి.
జనసేన పార్టీ రాష్ట్ర నాయకులు గాదె పృథ్వీ.
స్టేషన్ ఘనపూర్, అక్టోబర్ 3 (తెలంగాణ ముచ్చట్లు):
పట్టభద్రులు ఓటర్లుగా నమోదు చేసుకోవాలని జనసేన పార్టీ రాష్ట్ర నాయకులు గాదె పృథ్వీ కోరారు. స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ కేంద్రంలో జనసైనికులతో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు.ఈ సమావేశానికి ఎమ్మెల్సీ ఎన్నికల పార్టీ కోఆర్డినేటర్లు మండపాక కావ్య, బెక్కం జనార్దన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. జనసేన పార్టీ అభ్యర్థి గడల శ్రీనివాస్‌రావును పట్టభద్రుల ఎమ్మెల్సీగా గెలిపించాలని కోరారు. గ్రామస్థాయిలో ప్రతి పట్టభద్రుడిని ఓటరుగా నమోదు చేసేలా జనసైనికులు కృషి చేయాలని సూచించారు.
ఈ మేరకు ఎన్నికల కమిటీని ప్రకటించారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆశయ సాధనకు ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం దిశగా పార్టీ శ్రేణులు సమష్టిగా ముందుకు సాగాలని నాయకులు పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు ఆమంచ సునీల్, మహమ్మద్ రజాక్, కొలిపాక
వంశీ, అక్కెనపల్లి సాయి, కనకం రంజిత్, ప్రశాంత్‌రెడ్డి, మహమ్మద్ ఫరీద్, మధుకర్, గొట్టిముక్కల రాజకుమార్, శ్రీకాంత్, సాగ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.


Comments