రెడ్డి జాగృతి మండల అధ్యక్షురాలిగా మంతెన సునీతారెడ్డి.
ఏకగ్రీవంగా ఎన్నిక.. శుభాకాంక్షలు వెల్లువ.
స్టేషన్ ఘనపూర్,అక్టోబర్ 3 (తెలంగాణ ముచ్చట్లు):
రెడ్డి జాగృతి స్టేషన్ ఘనపూర్ మండల అధ్యక్షురాలిగా తానేదార్పల్లి గ్రామానికి చెందిన మంతెన సునీతారెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.రెడ్డి జాగృతి వ్యవస్థాపక అధ్యక్షులు బుట్టెంగారి మాధవరెడ్డి, జాతీయ అధ్యక్షులు ఎడ్లే ఉప్పల్‌రెడ్డి, రాష్ట్ర అధ్యక్షురాలు పోరెడ్డి కవితారెడ్డి, జనగామ జిల్లా అధ్యక్షులు కర్రెడ్డి రఘునందన్‌రెడ్డి, వ్యవస్థాపక సభ్యులు నీరుడు దయాకర్‌రెడ్డి ఆదేశాల మేరకు సునీతారెడ్డిని మండల అధ్యక్షురాలిగా నియమించినట్లు తెలిపారు.
‘రెడ్డి బలం.. రెడ్డి ఐక్యం.. మన గౌరవం’ అనే నినాదంతో రెడ్డి జాగృతి సంస్థ రాష్ట్రవ్యాప్తంగా రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారిని ఏకం చేస్తూ వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తోందని పేర్కొన్నారు. ఇందులో భాగంగా సమాజ సేవలో చురుగ్గా పాల్గొంటున్న సునీతారెడ్డికి మండల బాధ్యతలు అప్పగించినట్లు తెలిపారు.
నూతనంగా ఎన్నికైన మండల అధ్యక్షురాలు మంతెన సునీతారెడ్డికి రెడ్డి జాగృతి నాయకులు, మండలంలోని రెడ్డి బంధువులు శుభాకాంక్షలు తెలిపారు.


Comments