కరీంనగర్‌లో ఆకట్టుకుంటున్న ‘ఎకాం’ ప్రదర్శన.

కరీంనగర్‌లో ఆకట్టుకుంటున్న ‘ఎకాం’ ప్రదర్శన.

*మహిళా పారిశ్రామికవేత్తలకు చేయూత*

*ప్రత్యేక ఉత్పత్తులతో ఆకట్టుకుంటున్న ప్రదర్శన*

*స్థానిక ఉత్పత్తులకు ప్రజలు అండగా నిలవాలని ఎమ్మెల్యే గంగుల పిలుపు*

కరీంనగర్, అక్టోబర్ 3(తెలంగాణ ముచ్చట్లు ):

మహిళా పారిశ్రామికవేత్తలు స్వయంశక్తితో ఆర్థికంగా ఎదుగుతూ, ఇతరులకు ఉపాధి కల్పించే స్థాయికి ఎదగడానికి సమాజం ప్రోత్సాహం అందించాల్సిన అవసరం ఉందని మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అన్నారు.

స్థానిక ఉత్పత్తులకు ప్రజల ఆదరణ పెంచడంతో పాటు మహిళా వ్యాపారవేత్తలకు ప్రోత్సాహం అందించాలనే ఉద్దేశంతో కరీంనగర్‌లోని మహాత్మా జ్యోతిబా పూలే మైదానంలో ‘ఎకాం’ సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ఎగ్జిబిషన్‌ను శనివారం ఆయన ప్రారంభించారు. నగర బీఆర్ఎస్ అధ్యక్షుడు చల్ల హరిశంకర్, జిల్లా చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు చిట్టిమల్ల శ్రీనివాస్ తదితరులతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి, రిబ్బన్ కట్ చేశారు.

ప్రదర్శనలో మున్మున్ సేన్, రోజా, విశాల్, వారి మిత్రబృందంతో పాటు పలువురు మహిళా పారిశ్రామికవేత్తలు స్వయంగా రూపొందించిన ఉత్పత్తులను ప్రదర్శనకు ఉంచారు. ప్రత్యేకమైన హ్యాండ్‌మేడ్ క్రాఫ్ట్స్, చీరలు, గాజులు, మెహందీ ఉత్పత్తులు, మహిళలకు అవసరమైన పలు రకాల వస్తువులు సందర్శకులను ఆకట్టుకుంటున్నాయి.

పెద్ద షాపుల్లో అధిక ధరలకు లభించే కొన్ని హ్యాండ్‌మేడ్ ఉత్పత్తులు నేరుగా తయారీదారుల నుంచే అందుబాటులోకి రావడం ఈ ప్రదర్శన ప్రత్యేకతగా నిలుస్తోంది. రానున్న పండుగల సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని మహిళలు, కుటుంబాలకు అవసరమైన అనేక రకాల ఉత్పత్తులను ఒకే వేదికపై అందుబాటులో ఉంచినట్లు నిర్వాహకులు తెలిపారు.

చిన్నచిన్న వ్యాపారాలు నిర్వహిస్తూ స్వయం ఉపాధితో ముందుకు సాగుతున్న మహిళలకు ‘ఎకాం’ మంచి వేదికగా నిలుస్తోందని పేర్కొన్నారు. ప్రజలు ప్రదర్శనను సందర్శించి మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించాలని, సోషల్ మీడియా ద్వారా వారి ఉత్పత్తులను మరింత మందికి పరిచయం చేయాలని కోరారు.

శనివారం, ఆదివారం రెండు రోజుల పాటు జరిగే ఈ ప్రదర్శనకు ప్రజల నుంచి లభించే స్పందన ఆధారంగా భవిష్యత్తులో మరింత విస్తృత స్థాయిలో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తామని నిర్వాహకులు తెలిపారు.

ఈ కార్యక్రమంలో మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఏనుగు రవీందర్ రెడ్డి, మాజీ మేయర్ సర్దార్ రవీందర్ సింగ్, మాజీ వైస్ ఎంపీపీ తిరుపతి నాయక్, కార్పొరేటర్ గడ్డి ప్రదీప్, మాజీ సుడా డైరెక్టర్ నేతి రవివర్మ, మాజీ అర్బన్ బ్యాంకు డైరెక్టర్ కర్ర సూర్య శేఖర్, బీఆర్ఎస్ నాయకులు గంగాధర చందు, నారదాసు వసంత రావు, మిడిదొడ్డి నవీన్ కుమార్, పబ్బతి శ్రీనివాస్రెడ్డి, ఎండీ అఫ్రోజ్, శ్రావణ్ తదితరులు పాల్గొన్నారు.IMG-20261003-WA0008

Tags:

Post Your Comments

Comments

Latest News

మాజీ సర్పంచ్ సురవరం వేమారెడ్డి మృతి. మాజీ సర్పంచ్ సురవరం వేమారెడ్డి మృతి.
ఎల్కతుర్తి, అక్టోబర్ 3 (తెలంగాణ ముచ్చట్లు):  ఎల్కతుర్తి గ్రామ మాజీ సర్పంచ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు సురవరం వేమారెడ్డి (82) శనివారం హనుమకొండలో చికిత్స పొందుతూ...
మాట తప్పిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దె దించాలి.
పట్టభద్రులు ఓటర్లుగా నమోదు చేసుకోవాలి.
పండుగ ముందే రోడ్డు క్లియర్.
రెడ్డి జాగృతి మండల అధ్యక్షురాలిగా మంతెన సునీతారెడ్డి.
చలో వరంగల్‌ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి.
కార్మికుల సంక్షేమ పథకాలు వెంటనే అమలు చేయాలి.