ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా అభివృద్ధి పనులు.

పలు డివిజన్లలో సీసీ రోడ్లు, డ్రైనేజీ, మంచినీటి పనులకు శంకుస్థాపన.

ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా అభివృద్ధి పనులు.

కరీంనగర్, అక్టోబర్ 3(తెలంగాణ ముచ్చట్లు ):

నగర పాలక సంస్థ పరిధిలో పలు డివిజన్లలో వివిధ నిధులతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు నగర మేయర్ కొIMG-20261003-WA0019లగాని శ్రీనివాస్ శంకుస్థాపన చేశారు. ప్రజలకు మౌలిక వసతులు మెరుగుపర్చే లక్ష్యంతో రహదారులు, డ్రైనేజీ, మంచినీటి పైపులైన్ల నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు.

నగర పాలక సంస్థ 11వ డివిజన్‌లో సుడా నిధులతో చేపట్టనున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులకు మేయర్ శంకుస్థాపన చేశారు. అలాగే 3వ డివిజన్ మణికేశ్వరి నగర్‌లో మున్సిపల్ సాధారణ నిధులతో నిర్మించనున్న సీసీ రోడ్డు పనులకు కూడా శంకుస్థాపన చేశారు.

29వ డివిజన్ కిసాన్ నగర్‌లో యుఐడిఎఫ్ నిధులతో చేపట్టనున్న సీసీ రోడ్డు, డ్రైన్ పైప్‌లైన్ నిర్మాణ పనులతో పాటు 15వ ఆర్థిక సంఘం నిధులతో చేపట్టనున్న మంచినీటి పైప్‌లైన్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ నగరంలోని అన్ని డివిజన్లలో ప్రజలకు అవసరమైన మౌలిక వసతులను మెరుగుపరిచేందుకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. రహదారులు, డ్రైనేజీ, మంచినీటి సమస్యలకు పరిష్కారం చూపేలా అభివృద్ధి పనులు చేపడుతున్నామని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ వై. సునీల్ రావు, కార్పొరేటర్లు ఆకుల నర్మదా నర్సయ్య, సాదినేని లావణ్య మునిందర్, సోమిడి వేణు ప్రసాద్, కేప్‌పీ చంద్ర, గాజా శివరాం, ఎన్నం ప్రకాష్, మున్సిపల్ అధికారులు, ఆయా కాలనీల ప్రజలు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

మాజీ సర్పంచ్ సురవరం వేమారెడ్డి మృతి. మాజీ సర్పంచ్ సురవరం వేమారెడ్డి మృతి.
ఎల్కతుర్తి, అక్టోబర్ 3 (తెలంగాణ ముచ్చట్లు):  ఎల్కతుర్తి గ్రామ మాజీ సర్పంచ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు సురవరం వేమారెడ్డి (82) శనివారం హనుమకొండలో చికిత్స పొందుతూ...
మాట తప్పిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దె దించాలి.
పట్టభద్రులు ఓటర్లుగా నమోదు చేసుకోవాలి.
పండుగ ముందే రోడ్డు క్లియర్.
రెడ్డి జాగృతి మండల అధ్యక్షురాలిగా మంతెన సునీతారెడ్డి.
చలో వరంగల్‌ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి.
కార్మికుల సంక్షేమ పథకాలు వెంటనే అమలు చేయాలి.