పట్టభద్రులంతా ఓటర్లుగా నమోదు చేసుకోవాలి.
పనస శంకర్ గౌడ్, జిల్లా సాహితీ కళావేదిక అధ్యక్షులు .
వనపర్తి,అక్టోబర్03(తెలంగాణ ముచ్చట్లు):
పట్టభద్రులంతా తమ ఓటు హక్కును బాధ్యతగా వినియోగించుకునేందుకు ఓటర్లుగా నమోదు చేసుకోవాలని సాహితీ కళా వేదిక వనపర్తి జిల్లా అధ్యక్షుడు పలుస శంకర్ గౌడ్ పిలుపునిచ్చారు. వనపర్తి పట్టణంలోని ప్రైవేట్ పాఠశాలల్లో పనిచేస్తున్న పట్టభద్రులు, ఉపాధ్యాయులకు ఫారం-18లను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నవంబర్ 2023 వరకు ఏదైనా యూనివర్సిటీలో డిగ్రీ పూర్తి చేసిన వారు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటు నమోదుకు అర్హులని తెలిపారు. నవంబర్ 6 తుది గడువు కావడంతో అర్హులైన ప్రతి ఒక్కరూ వెంటనే ఓటరుగా నమోదు చేసుకోవాలని సూచించారు. డిగ్రీ సర్టిఫికెట్, ఆధార్ కార్డు, ఫొటో, ఓటర్ ఐడీ జిరాక్స్ తదితర పత్రాలతో ఫారం-18 ద్వారా ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చని వివరించారు.ప్రజాస్వామ్యంలో ఓటు వజ్రాయుధం వంటిదని, విద్యావంతులు తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని కోరారు. యువత, ఉద్యోగులు, ఉపాధ్యాయులతో పాటు అర్హులైన పట్టభద్రులందరూ ఓటు నమోదు చేసుకుని, తమ బంధువులు, స్నేహితులకు కూడా అవగాహన కల్పించాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో సాహితీ కళా వేదిక సభ్యులు ఉప్పరి తిరుమలేష్, బండారు శ్రీనివాస్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.


Comments