ఏఐఎస్ఎఫ్‌లో విద్యార్థుల చేరిక.
విద్యార్థి ఉద్యమాన్ని బలోపేతం చేయాలని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడి పిలుపు.
Views: 0
On
కరీంనగర్, అక్టోబర్ 4(తెలంగాణ ముచ్చట్లు ):
కరీంనగర్ నగరంలోని బొమ్మకల్, జ్యోతినగర్, కిసాన్‌నగర్, మారుతినగర్ ప్రాంతాలకు చెందిన పలువురు విద్యార్థులు ఈరోజు ఏఐఎస్ఎఫ్‌లో చేరారు. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు మణికంట రెడ్డి నూతనంగా చేరిన విద్యార్థులకు కండువాలు కప్పి, సభ్యత్వం అందజేసి ఏఐఎస్ఎఫ్‌లోకి సాదరంగా ఆహ్వానించారు.
ఈ సందర్భంగా మణికంట రెడ్డి మాట్లాడుతూ విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం ఏఐఎస్ఎఫ్ నిరంతరం పోరాడుతుందని తెలిపారు. విద్యార్థుల హక్కుల పరిరక్షణతో పాటు విద్యా రంగంలోని సమస్యలపై ఉద్యమాలను మరింత బలోపేతం చేస్తామని పేర్కొన్నారు.
విద్యార్థులు పెద్ద సంఖ్యలో ఏఐఎస్ఎఫ్‌లో చేరి విద్యార్థి ఉద్యమాన్ని బలోపేతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ నాయకులు, నూతనంగా చేరిన విద్యార్థులు పాల్గొన్నారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
04 Oct 2026 22:27:05
ఆల్ ఇండియా హ్యూమన్ రైట్స్ అసోసియేషన్ ఉమ్మడి వరంగల్ జిల్లా నూతన కమిటీలు ఏర్పాటు
వరంగల్, అక్టోబర్ 4 (తెలంగాణ ముచ్చట్లు):
సమాజంలో ప్రతి ఒక్కరి మానవ...


Comments