తాటికొండలో బీసీ మేధోమథనం.

ప్రముఖ వైద్యుడికి ఆహ్వానం.

తాటికొండలో బీసీ మేధోమథనం.

స్టేషన్ ఘనపూర్,అక్టోబర్ 4 (తెలంగాణ ముచ్చట్లు): 

ఈ నెల 11న జనగామలో నిర్వహించనున్న బీసీ ఇంటలెక్చువల్ ఫోరం సదస్సును విజయవంతం చేయాలని ఫోరం నాయకులు పిలుపునిచ్చారు. స్టేషన్ ఘనపూర్ మండలం తాటికొండ గ్రామంలో శనివారం ప్రముఖ వైద్యుడు డాక్టర్ కె. శ్రావణ్ కుమార్ను ఫోరం ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిసి సదస్సుకు ఆహ్వానించారు. ఈ సందర్భంగా సదస్సు ఆహ్వాన పత్రికను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఫోరం జిల్లా అధ్యక్షుడు గద్ద అనిల్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ.. బీసీల సామాజిక, విద్యా, రాజకీయ అభ్యున్నతిపై సదస్సులో కీలకంగా చర్చించనున్నట్లు తెలిపారు. బీసీల అభివృద్ధికి అవసరమైన భవిష్యత్ కార్యాచరణపై మేధావులు, విద్యావేత్తలు తమ అభిప్రాయాలను వెల్లడించనున్నట్లు పేర్కొన్నారు.
బీసీ మేధావులు, విద్యావేత్తలు, వివిధ రంగాల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో హాజరై సదస్సును విజయవంతం చేయాలని కోరారు.
కార్యక్రమంలో ఫోరం ప్రధాన కార్యదర్శి మారగోని సిద్దయ్య గౌడ్, నాయకులు ప్రభాకర్, ఉమ్మగోని రాజు గౌడ్, సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News