ఉమ్మడి వరంగల్ జిల్లా స్థాయి ఎస్‌జీఎఫ్‌ స్విమ్మింగ్ ఎంపికలు విజయవంతం.

120 మంది విద్యార్థుల ఉత్సాహంగా పాల్గొన్నారు .

ఉమ్మడి వరంగల్ జిల్లా స్థాయి ఎస్‌జీఎఫ్‌ స్విమ్మింగ్ ఎంపికలు విజయవంతం.

జయశంకర్ భూపాలపల్లి,అక్టోబర్ 4 (తెలంగాణ ముచ్చట్లు): 

70వ ఎస్‌జీఎఫ్‌ ఉమ్మడి వరంగల్ జిల్లా ఆధ్వర్యంలో అండర్‌-14, అండర్‌-17 బాలబాలికల ఉమ్మడి జిల్లా స్థాయి స్విమ్మింగ్ ఎంపిక పోటీలు ఆదివారం జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని సింగరేణి అంబేద్కర్ స్టేడియంలో ఘనంగా నిర్వహించారు.ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలోని వివిధ పాఠశాలల నుంచి సుమారు 120 మంది విద్యార్థులు ఈ ఎంపిక పోటీల్లో ఉత్సాహంగా పాల్గొని తమ ప్రతిభను చాటుకున్నారు. వివిధ విభాగాల్లో విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యేందుకు పోటీపడ్డారు.ఈ సందర్భంగా ఎస్‌జీఎఫ్‌ సెక్రటరీ ఎల్. జైపాల్ మాట్లాడుతూ.. జిల్లా స్థాయి పోటీల్లో అత్యుత్తమ నైపుణ్యం ప్రదర్శించిన క్రీడాకారులను ఎంపిక చేసి, త్వరలో నిర్వహించనున్న తెలంగాణ రాష్ట్ర స్థాయి స్విమ్మింగ్ పోటీలకు పంపించనున్నట్లు తెలిపారు. రాష్ట్ర స్థాయిలోనూ IMG-20261004-WA0059ఉమ్మడి వరంగల్ జిల్లా క్రీడాకారులు ప్రతిభ కనబరిచి పతకాలు సాధించాలని ఆకాంక్షించారు.కార్యక్రమంలో వ్యాయామ ఉపాధ్యాయులు ఎస్. రమేష్, కోటి రమేష్, సతీష్, అన్వర్, సమ్మయ్య, కోచ్‌లు శ్రీనివాస్, నవీన్, సింగరేణి స్పోర్ట్స్ ఆఫీసర్ పరస శ్రీనివాస్ తదితరులు పాల్గొని క్రీడాకారులను ప్రోత్సహించారు.

Tags:

Post Your Comments

Comments

Latest News