ఉత్సాహంగా కరీంనగర్ రెడ్‌క్రాస్ సొసైటీ ఎన్నికలు.

ఓటు హక్కు వినియోగించుకున్న ఎమ్మెల్యే గంగుల కమలాకర్.

ఉత్సాహంగా కరీంనగర్ రెడ్‌క్రాస్ సొసైటీ ఎన్నికలు.

కరీంనగర్, అక్టోబర్ 4(తెలంగాణ ముచ్చట్లు ):

జిల్లా కేంద్రంలోని శ్రీ రాజరాజేశ్వర డిగ్రీ కళాశాలలో ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ (ఐఆర్‌సీఎస్) కరీంనగర్ జిల్లా శాఖ మేనేజింగ్ కమిటీ ఎన్నికలు ఉత్సాహంగా, ప్రశాంత వాతావరణంలో జరిగాయి.

ఎన్నికల్లో భాగంగా కరీంనగర్ ఎమ్మెల్యే, రాష్ట్ర మాజీ మంత్రి గంగుల కమలాకర్ పోలింగ్ కేంద్రానికి స్వయంగా చేరుకుని తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. రెడ్‌క్రాస్ సొసైటీ సేవా కార్యక్రమాలను మరింత విస్తరించే నూతన పాలకవర్గం ఎంపిక కోసం జరుగుతున్న ఎన్నికలపై సభ్యుల్లో ఆసక్తి నెలకొంది.

పోలింగ్ ప్రక్రియలో జిల్లాకు చెందిన పలువురు ప్రముఖులు, రెడ్‌క్రాస్ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలింగ్ ప్రక్రియను పర్యవేక్షించారు.

Tags:

Post Your Comments

Comments

Latest News