ఆటో కార్మికులకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుంది.
త్వరలో ఆటో కార్మికుల సంక్షేమ బోర్డు ఏర్పాటుకు కృషి
-- రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్
వనపర్తి,అక్టోబర్04(తెలంగాణ ముచ్చట్లు):
ఆటో కార్మికుల సమస్యల పరిష్కారానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. శనివారం హైదరాబాద్ ప్రజాభవన్‌లో ఆటో డ్రైవర్లకు డిన్నర్ ఏర్పాటు చేసి వారి సమస్యలపై చర్చించారు.ఈ సందర్భంగా ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. ఆటో కార్మికుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకురావడంలో ఆటో జేఏసీ చేస్తున్న కృషిని అభినందించారు.మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఆటో మీటర్ చార్జీలను పెంచినట్లు తెలిపారు. త్వరలో కేబినెట్‌తో చర్చించి ఆటో కార్మికుల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసే దిశగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు.తెలంగాణ ప్రైవేట్ ట్రాన్స్‌పోర్ట్ డ్రైవర్స్ అండ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి దయ్యాల దాసు మాట్లాడుతూ.. మీటర్ చార్జీల పెంపు, సంక్షేమ బోర్డు ఏర్పాటుపై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలకు కృతజ్ఞతలు తెలిపారు. ఆటో కార్మికుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాలకు తమ యూనియన్ పూర్తి సహకారం అందిస్తుందని అన్నారు.కార్యక్రమంలో ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్, ఆటో జేఏసీ చైర్మన్ వేముల మారయ్య, కన్వీనర్ వెంకటేశం, ఐఎన్‌టీయూసీ నాయకులు నరసింహారెడ్డి, మల్లేష్ గౌడ్, నాగన్న గౌడ్ తదితరులు పాల్గొన్నారు.


Comments