ఘనంగా మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి జన్మదిన వేడుకలు.

వలస వెళ్లినా వీడని అనుబంధం..

ఘనంగా మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి జన్మదిన వేడుకలు.

వనపర్తి,అక్టోబర్04(తెలంగాణ ముచ్చట్లు): 

మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని హైదరాబాద్ రామంతపూర్‌లో బీఆర్‌ఎస్ యువ నాయకులు ఘనంగా వేడుకలు నిర్వహించారు. కేక్ కట్ చేసి ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం వెల్టూర్ గ్రామానికి చెందిన పలువురు యువకులు ఉద్యోగ, ఉపాధి కోసం హైదరాబాద్‌కు వలస వెళ్లారు. స్వగ్రామానికి దూరంగా ఉన్నప్పటికీ నిరంజన్ రెడ్డిపై ఉన్న అభిమానం మాత్రం చెక్కుచెదరలేదని, అందుకే ప్రతి సంవత్సరం ఆయన జన్మదినాన్ని హైదరాబాద్‌లో నిర్వహిస్తున్నామని తెలిపారు.ఈ సందర్భంగా యువకులు మాట్లాడుతూ.. మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి హయాంలో వనపర్తి ప్రాంతంలో చేపట్టిన అభివృద్ధి పనులు, సాగునీరు, రహదారులు, విద్య, వైద్య రంగాల్లో జరిగిన అభివృద్ధి చిరస్మరణీయమని పేర్కొన్నారు. వనపర్తి జిల్లా ఏర్పాటుతో పాటు ప్రాంత అభివృద్ధికి ఆయన చేసిన కృషి ఎప్పటికీ గుర్తుండిపోతుందని అన్నారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యం ఇచ్చారని తెలిపారు.నిరంజన్ రెడ్డి ఆయురారోగ్యాలతో మరిన్ని సంవత్సరాలు ప్రజలకు సేవలందించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఇరికిచెట్టి మధు, దయ్యాల జయరాజ్, చంద్రమోహన్, వెంకటగిరి శ్యామ్, కానాపురం శ్రీను, ఏర్పుల రాఘవ తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News