విశ్వకర్మల సత్తా చాటాలి.. ఇక తగ్గేదేలే!.

ఘనపూర్ గడ్డపై గర్జించిన రాష్ట్ర అధ్యక్షుడు బిక్షపతి.

విశ్వకర్మల సత్తా చాటాలి.. ఇక తగ్గేదేలే!.

స్టేషన్ ఘనపూర్,అక్టోబర్4 (తెలంగాణ ముచ్చట్లు): 

ఇన్నాళ్లు వృత్తికే పరిమితమయ్యామని, ఇక అన్ని రంగాల్లో విశ్వబ్రాహ్మణుల సత్తా చాటాలని విశ్వకర్మ ఐక్య సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎర్రోజు బిక్షపతి పిలుపునిచ్చారు. విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో విశ్వకర్మలు ముందుకు సాగాలని అన్నారు.
స్టేషన్ ఘనపూర్ పట్టణంలోని శివునిపల్లిలో ఆదివారం నిర్వహించిన మండల కమిటీ ఎన్నికల సభలో ఆయన మాట్లాడారు. విశ్వకర్మల్లో ఐక్యత లేకపోవడం వల్లే వెనుకబడ్డామని, ఇకనైనా ఐక్యంగా ముందుకు సాగుతూ అన్ని రంగాల్లో తమ హక్కులను సాధించుకోవాలని పిలుపునిచ్చారు.సిరికొండ కుమారస్వామి అధ్యక్షతన, జిల్లా అధ్యక్షుడు దిగోజు నర్సింహాచారి ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో మండల నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.గౌరవ అధ్యక్షుడిగా మారేడుపాక ఉమాశంకర్, అధ్యక్షుడిగా కాసోజు రవీందర్, కార్యదర్శిగా మారేడుపాక రాజు ఎన్నికయ్యారు.ఈ సందర్భంగా నూతన కమిటీ సభ్యులు మాట్లాడుతూ.. విశ్వకర్మల సంక్షేమం, హక్కుల పరిరక్షణ కోసం ఐక్యంగా పనిచేస్తామని తెలిపారు.
కార్యక్రమంలో మొగుదుంపురం కిషోర్, కేశోజు అమర్, చెక్కపల్లి రాజు తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News