వార్డు సభ్యుల ఫోరం నియోజకవర్గ ఇన్‌ఛార్జిగా నాగబండి సంతోష్.
Views: 0
On
స్టేషన్ ఘనపూర్,అక్టోబర్ 4 (తెలంగాణ ముచ్చట్లు):
తెలంగాణ రాష్ట్ర వార్డు మెంబర్స్ ఫోరం స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ ఇన్‌ఛార్జిగా నాగబండి సంతోష్ నియమితులయ్యారు. ఫోరం రాష్ట్ర అధ్యక్షురాలు నాగబెల్లి జ్యోతి మహేష్ ఆదేశాల మేరకు ఈ నియామకం చేపట్టారు.
జనగామ జిల్లా వార్డు మెంబర్స్ ఫోరం ఇన్‌ఛార్జి గుండేటి రాంచందర్ గౌడ్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో సంతోష్‌ను నియోజకవర్గ ఇన్‌ఛార్జిగా నియమించారు. ఈ సందర్భంగా నాగబండి సంతోష్ మాట్లాడుతూ.. తన నియామకానికి సహకరించిన ఫోరం రాష్ట్ర, జిల్లా నాయకులతో పాటు ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు.కార్యక్రమంలో సోషల్ మీడియా జిల్లా కోఆర్డినేటర్ బొల్లం అవినాష్, ఎస్టీ విభాగం జిల్లా నాయకులు భూక్యా ఎం.జి. నాయక్, స్టేషన్ ఘనపూర్ మండల ఇన్‌ఛార్జి గుండె లక్ష్మణ్, రాజు, గోరంతల వెంకటేష్, జీడి సంజీవ్ తదితరులు పాల్గొన్నారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
04 Oct 2026 22:27:05
ఆల్ ఇండియా హ్యూమన్ రైట్స్ అసోసియేషన్ ఉమ్మడి వరంగల్ జిల్లా నూతన కమిటీలు ఏర్పాటు
వరంగల్, అక్టోబర్ 4 (తెలంగాణ ముచ్చట్లు):
సమాజంలో ప్రతి ఒక్కరి మానవ...


Comments