రెడ్ల కార్పొరేషన్ సాధించాలి.

రెడ్డి జాగృతి నూతన కమిటీలు ఏకగ్రీవ ఎన్నిక.

రెడ్ల కార్పొరేషన్ సాధించాలి.

స్టేషన్ ఘనపూర్, అక్టోబర్ 4 (తెలంగాణ ముచ్చట్లు): 

తమ హక్కుల సాధనతో పాటు రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు కోసం ఐక్యంగా పోరాడాలని రెడ్డి జాగృతి నాయకులు పిలుపునిచ్చారు. ఆదివారం హైదరాబాద్‌లోని ఉప్పల్‌లో రెడ్డి జాగృతి రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో జిల్లా, మండల నూతన కార్యవర్గాలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడిగా కరెడ్ల రఘునందన్ రెడ్డి, ఉపాధ్యక్షుడిగా కిసరి మాధవ్ రెడ్డి, మండల అధ్యక్షుడిగా చల్లా రఘు రెడ్డి, మండల ఉపాధ్యక్షుడిగా నాయ్యం బుచ్చి రెడ్డిలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.అనంతరం నూతనంగా ఎన్నికైన నాయకులు మాట్లాడుతూ.. రెడ్డి వర్గాల సంక్షేమం, అభివృద్ధి కోసం ప్రభుత్వం చర్యలు చేపట్టాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేసి, రెడ్డి వర్గాల సామాజిక, ఆర్థిక అభివృద్ధికి అవసరమైన కార్యక్రమాలు చేపట్టాలని డిమాండ్ చేశారు.రెడ్డి జాగృతిని గ్రామస్థాయి నుంచి మరింత బలోపేతం చేసి, తమ హక్కులు, సమస్యల పరిష్కారం కోసం ఐక్యంగా కృషి చేస్తామని నూతన కార్యవర్గ సభ్యులు తెలిపారు.

Tags:

Post Your Comments

Comments

Latest News