తైక్వాండోలో కొత్తకోట విద్యార్థుల సత్తా.
ఉమ్మడి జిల్లా స్థాయి పోటీలకు 10 మంది ఎంపిక.
వనపర్తి,అక్టోబర్04(తెలంగాణ ముచ్చట్లు):
వనపర్తి జిల్లా కేంద్రంలో ఎస్‌జీఎఫ్ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా స్థాయి తైక్వాండో మార్షల్ ఆర్ట్స్ పోటీల్లో కొత్తకోట విద్యార్థులు ప్రతిభ చాటారు. కొత్తకోట పట్టణంతో పాటు అగ్రహారం, మోజర్ల, కనిమెట్ట ప్రాంతాలకు చెందిన దాదాపు 10 మంది విద్యార్థులు అత్యుత్తమ ప్రదర్శనతో ఉమ్మడి జిల్లా స్థాయి పోటీలకు ఎంపికయ్యారు.ఎంపికైన విద్యార్థులు ఈ నెల 8న గద్వాలలో నిర్వహించనున్న ఎస్‌జీఎఫ్ స్కూల్ గేమ్స్ పోటీల్లో వనపర్తి జిల్లా తరఫున పాల్గొననున్నారు. ఈ సందర్భంగా విద్యార్థుల ప్రతిభను పలువురు అభినందించారు.విద్యార్థులను వారి కోచ్‌లు శివశంకర్, పరశురాముడు, రవితో పాటు వనపర్తి తైక్వాండో అసోసియేషన్ సీనియర్ మాస్టర్లు పెంటన్న యాదవ్, నరేంద్ర సాగర్, శ్రీను యాదవ్, నరేష్ నాయుడు, రమేష్ రెడ్డి, యాదగిరి, శివయ్య, మాధవ్ నాయుడు అభినందించారు. గద్వాలలో జరిగే పోటీల్లోనూ విద్యార్థులు ప్రతిభ కనబరిచి వనపర్తి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.కార్యక్రమంలో వ్యాయామ ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పాల్గొని ఎంపికైన విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు.


Comments