సామాజిక సేవలో రెడ్‌క్రాస్ కీలక పాత్ర.
ఓటు హక్కు వినియోగించుకున్న ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి.
కరీంనగర్, అక్టోబర్ 4(తెలంగాణ ముచ్చట్లు ):
కరీంనగర్ రెడ్‌క్రాస్ సొసైటీ కమిటీ సభ్యుల ఎన్నికలు ఆదివారం ఉదయం ఎస్ఆర్‌ఆర్ డిగ్రీ కళాశాలలో నిర్వహించారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, వీఎన్‌ఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు ఆల్ఫోర్స్ డా. వి. నరేందర్ రెడ్డి పాల్గొని తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.
ఈ సందర్భంగా నరేందర్ రెడ్డి మాట్లాడుతూ సమాజానికి రెడ్‌క్రాస్ సొసైటీ అందిస్తున్న సేవలు అభినందనీయమన్నారు. అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవలు అందించడం స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. ప్రజలకు అవసరమైన సమయంలో సహాయ సహకారాలు అందిస్తూ సామాజిక సేవలో రెడ్‌క్రాస్ సొసైటీ కీలక పాత్ర పోషిస్తోందన్నారు.
ప్రతి ఒక్కరూ ప్రతిష్టాత్మకమైన రెడ్‌క్రాస్ సొసైటీలో సభ్యత్వం పొందాలని, తద్వారా సొసైటీ అందించే వివిధ సేవలను వినియోగించుకోవడంతో పాటు సామాజిక సేవలో భాగస్వాములు కావాలని ఆయన సూచించారు.
ఎన్నికల సందర్భంగా పలువురు ప్రముఖులను నరేందర్ రెడ్డి కలుసుకుని ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, సామాజిక అంశాలపై చర్చించారు. కార్యక్రమంలో పలువురు రెడ్‌క్రాస్ సభ్యులు, ప్రముఖులు పాల్గొన్నారు.


Comments