మానవ హక్కుల పరిరక్షణకు నిరంతరం పోరాటం.
ఆల్ ఇండియా హ్యూమన్ రైట్స్ అసోసియేషన్ ఉమ్మడి వరంగల్ జిల్లా నూతన కమిటీలు ఏర్పాటు
వరంగల్, అక్టోబర్ 4 (తెలంగాణ ముచ్చట్లు):
సమాజంలో ప్రతి ఒక్కరి మానవ హక్కులను పరిరక్షించడంతో పాటు పేదలు, మహిళలు, చిన్నారులకు జరుగుతున్న అన్యాయాలపై నిరంతరం పోరాడుతామని ఆల్ ఇండియా హ్యూమన్ రైట్స్ అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు. సంస్థ తెలంగాణ రాష్ట్ర కోఆర్డినేటర్ మెరుగు రమేష్ ఆదేశాల మేరకు ఆదివారం వరంగల్‌లో ఉమ్మడి వరంగల్ జిల్లా స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా హనుమకొండ, వరంగల్ జిల్లాలకు నూతన కమిటీలను ఏర్పాటు చేశారు.కార్యక్రమానికి హైకోర్టు అడ్వకేట్, హ్యూమన్ రైట్స్ అడ్వకేసీ అడ్వైజర్ వ్యవస్థాపకులు సత్య, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కోమండ్ల శ్రీనివాస్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ బండి సదానందం, మెరుగు రాంబాబు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. నూతనంగా నియమితులైన కమిటీ సభ్యులకు నియామక పత్రాలను అందజేశారు.
ఈ సందర్భంగా సత్య మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి పేదవాడికి చేరేలా సంస్థ తరఫున కృషి చేస్తామన్నారు. పోలీస్ స్టేషన్లు, ప్రభుత్వ కార్యాలయాల్లో సామాన్యులు ఎదుర్కొంటున్న ఇబ్బందులతో పాటు మహిళలు, చిన్నారులపై జరుగుతున్న దాడులు, అన్యాయాలపై నిరంతరం పోరాడుతామని తెలిపారు.రాష్ట్ర అధ్యక్షుడు కోమండ్ల శ్రీనివాస్ మాట్లాడుతూ.. ప్రభుత్వం, ప్రజలకు మధ్య అనుసంధానంగా పనిచేస్తూ సంక్షేమ పథకాలు అర్హులకు అందేలా కృషి చేస్తామన్నారు. ప్రభుత్వ యంత్రాంగంతో సమన్వయం చేసుకుంటూ అవినీతి నిర్మూలనకు తమ వంతు కృషి చేస్తామని పేర్కొన్నారు.రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ బండి సదానందం మాట్లాడుతూ.. నూతన కమిటీ సభ్యులు సంస్థ నియమ నిబంధనలకు అనుగుణంగా పనిచేయాలని సూచించారు. పేదలు, మహిళలు, చిన్నారులకు ఎక్కడ అన్యాయం జరిగినా ప్రశ్నించేందుకు కమిటీ సభ్యులు ముందుండాలని పిలుపునిచ్చారు.
నూతన కమిటీలు ఏర్పాటు
హనుమకొండ జిల్లా అధ్యక్షుడిగా కీర్తి సురేష్, ఉపాధ్యక్షులుగా సీత దుర్గాప్రసాద్, శైలం బాలరాజు, ప్రధాన కార్యదర్శులుగా రేసు మధు, బత్తిని జీవన్, కార్యదర్శులుగా శంకర్ ఠాగూర్, కాలేరు వికాస్, బొజ్జ శ్రీకాంత్ నియమితులయ్యారు.వరంగల్ జిల్లా అధ్యక్షుడిగా మచిక రవీందర్, ఉపాధ్యక్షుడిగా కొమ్ముల దిలీప్, ప్రధాన కార్యదర్శిగా వేములపల్లి సునీత, కార్యదర్శిగా పల్నాటి మూర్తి నియమితులయ్యారు.
నూతన జిల్లా అధ్యక్షులు మాట్లాడుతూ.. మానవ హక్కులతో పాటు మహిళలు, చిన్నారుల హక్కులకు ఎలాంటి భంగం కలగకుండా ప్రజలకు సేవలందిస్తామని తెలిపారు. రాబోయే రోజుల్లో మానవ హక్కుల పరిరక్షణ కోసం మరింత చురుగ్గా పనిచేస్తామని పేర్కొన్నారు.
కార్యక్రమంలో రాష్ట్ర కమిటీ సభ్యులు ఎద్దు రాజు, కేతనబోయిన నాగరాజు, కనుకుంట్ల దిలీప్, పున్నం చందర్, శెట్టి రమేష్, నగేష్, గడల రమేష్, బుర్రి విజయ్ కుమార్, పల్లబోయిన మురళీకృష్ణ, ప్రతాప్ రెడ్డి, సునీల్ కుమార్, చల్లగురుగుల కుమార్ తదితరులు పాల్గొన్నారు.


Comments