దశాబ్దాల నిరీక్షణకు తెర.. బండమీద వడ్డెర కాలనీకి విద్యుత్ వెలుగులు.

దశాబ్దాల నిరీక్షణకు తెర.. బండమీద వడ్డెర కాలనీకి విద్యుత్ వెలుగులు.

భీమదేవరపల్లి, అక్టోబర్ 5 (తెలంగాణ ముచ్చట్లు):

ముల్కనూరు గ్రామంలోని బండమీద వడ్డెర కాలనీవాసుల దశాబ్దాల నిరీక్షణకు ఎట్టకేలకు తెరపడింది. ఇన్నాళ్లు విద్యుత్ సౌకర్యం లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న కాలనీలో కొత్తగా విద్యుత్ స్తంభాలు, వైరింగ్, వీధి దీపాలను ఏర్పాటు చేశారు.

కాలనీకి విద్యుత్ వెలుగులు రావడంతో నివాసితులు హర్షం వ్యక్తం చేశారు. విద్యుత్ సౌకర్యం కల్పించేందుకు కృషి చేసిన గ్రామ ప్రజాప్రతినిధులు, విద్యుత్ శాఖ అధికారులకు కాలనీవాసులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో విద్యుత్ శాఖ ఏఈ లక్ష్మణ్ నాయక్, లైన్‌మెన్ విజయ్, ముల్కనూరు సర్పంచ్ జాలి ప్రమోద్ రెడ్డి, ఉపసర్పంచ్ మమతా బాలకృష్ణ, వార్డు సభ్యులు వసంత, శ్రీను తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

మామిడి తోటలో అడవి దున్న సంచారం. మామిడి తోటలో అడవి దున్న సంచారం.
వేంసూరు, అక్టోబరు 5(తెలంగాణ ముచ్చట్లు): వేంసూరు మండలం చౌడవరం గ్రామ సమీపంలోని మామిడి తోటలో అడవి దున్న సంచరిస్తూ కనిపించడంతో స్థానికంగా కలకలం రేగింది. తోటలో అడవి...
భూములిచ్చేది లేదు.. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ వద్దు!
ప్రజావాణిపై.. ప్రజల్లో సన్నగిల్లిన ఆశలు!
డిగ్రీ ఉంటే చాలదు.. స్కిల్స్ ఉంటేనే భవిష్యత్తు!
రెండేళ్లుగా కన్నీళ్లే.. ఇప్పటికీ పింఛను కరువే!
దేవాదాయ శాఖ స్పెషల్ డ్రైవ్ మీటింగ్ కారణంగా..
మండల విద్యాధికారికి పీఆర్టీయూ టీఎస్ ఘన సన్మానం.