కుమ్మరులకు ఉచిత మట్టి రవాణా, మార్కెటింగ్ సదుపాయం కల్పించాలి.

కొత్తకోట ప్రజావాణిలో కుమ్మరి సంఘం వినతి.

కుమ్మరులకు ఉచిత మట్టి రవాణా, మార్కెటింగ్ సదుపాయం కల్పించాలి.

కొత్తకోట,అక్టోబర్05(తెలంగాణ ముచ్చట్లు):

కుమ్మరి వృత్తిదారులకు ఉచితంగా బంకమట్టి రవాణా సదుపాయం కల్పించడంతో పాటు, వారు తయారు చేసే మట్టి పాత్రల విక్రయానికి ప్రత్యేక మార్కెటింగ్‌ వ్యవస్థ ఏర్పాటు చేయాలని కోరుతూ కొత్తకోట మండల కుమ్మరి సంఘం ఆధ్వర్యంలో సోమవారం ఎంపీడీవోకు వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా సంఘం సభ్యులు మాట్లాడుతూ తరతరాలుగా మట్టి పాత్రలు, కుండలు తయారు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నామని, ప్రస్తుతం సరైన వసతులు లేక వృత్తి సంక్షోభంలో పడిందని తెలిపారు. చెరువుల నుంచి నాణ్యమైన బంకమట్టిని సేకరించేందుకు ఉచిత అనుమతులు ఇవ్వడంతో పాటు, మట్టిని పని ప్రదేశాలకు తరలించేందుకు ఉచిత రవాణా సౌకర్యం కల్పించాలని కోరారు.మండల, పట్టణ కేంద్రాల్లో గ్రామీణ వృత్తిదారుల కోసం ప్రత్యేక విక్రయ కేంద్రాలు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా దీపావళి, వినాయక చవితి వంటి పండుగల సందర్భంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా మట్టి ప్రమిదలు, మట్టి విగ్రహాలు విక్రయించుకునేందుకు ప్రత్యేక మార్కెట్‌ షెడ్లు ఏర్పాటు చేయాలని కోరారు. సంప్రదాయ కుమ్మరి కులవృత్తిని కాపాడేందుకు ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో కొత్తకోట శాలివాహన కుమ్మరి సంఘం సభ్యులు రాజశేఖర్‌, సత్యన్న, తిరుపతయ్య, రామకృష్ణ, శ్రీనివాసులు, రవి, రాజు, ఆంజనేయులు, అబ్దుల్లా తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

మామిడి తోటలో అడవి దున్న సంచారం. మామిడి తోటలో అడవి దున్న సంచారం.
వేంసూరు, అక్టోబరు 5(తెలంగాణ ముచ్చట్లు): వేంసూరు మండలం చౌడవరం గ్రామ సమీపంలోని మామిడి తోటలో అడవి దున్న సంచరిస్తూ కనిపించడంతో స్థానికంగా కలకలం రేగింది. తోటలో అడవి...
భూములిచ్చేది లేదు.. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ వద్దు!
ప్రజావాణిపై.. ప్రజల్లో సన్నగిల్లిన ఆశలు!
డిగ్రీ ఉంటే చాలదు.. స్కిల్స్ ఉంటేనే భవిష్యత్తు!
రెండేళ్లుగా కన్నీళ్లే.. ఇప్పటికీ పింఛను కరువే!
దేవాదాయ శాఖ స్పెషల్ డ్రైవ్ మీటింగ్ కారణంగా..
మండల విద్యాధికారికి పీఆర్టీయూ టీఎస్ ఘన సన్మానం.