ఇస్కాన్ టెంపుల్ డ్రైనేజీ సమస్య పరిష్కరిస్తాం.
*భక్తులకు ఇబ్బందులు లేకుండా ఇస్కాన్ డ్రైనేజీ సమస్యకు పరిష్కారం*
*ఆలయ పరిసరాల్లో సమస్యపై మేయర్, డిప్యూటీ మేయర్ తక్షణ స్పందన*
కరీంనగర్, అక్టోబర్ 5(తెలంగాణ ముచ్చట్లు ):
అల్కాపూరి కాలనీ బైపాస్ రోడ్డులోని శ్రీశ్రీ రాధా గోవింద మందిరం (ఇస్కాన్ టెంపుల్)ను నగర మేయర్ కొలగాని శ్రీనివాస్, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, నగర డిప్యూటీ మేయర్, మాజీ మేయర్ యాదగిరి సునీల్ రావు సందర్శించారు. ఆలయంలో శ్రీశ్రీ రాధా గోవింద స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆలయ బాధ్యులు పరిసరాల్లో నెలకొన్న పలు సమస్యలను మేయర్, డిప్యూటీ మేయర్ దృష్టికి తీసుకువచ్చారు. ముఖ్యంగా ఆలయ సమీపంలో డ్రైనేజీ నీరు పేరుకుపోవడంతో ఆలయ నిర్వహణతో పాటు నిత్యం ఆలయానికి వచ్చే భక్తులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను వివరించారు.
సమస్యపై తక్షణమే స్పందించిన మేయర్, డిప్యూటీ మేయర్ ఆలయ పరిసరాల్లో డ్రైనేజీ నీటి సమస్యను త్వరితగతిన పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అవసరమైన చర్యలు చేపడతామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ పడిశెట్టి వసంతలక్ష్మీ–భూమయ్య, ఇస్కాన్ ఆలయ బాధ్యులు ప్రభుజీ, డాక్టర్ రాజభాస్కర్ రెడ్డి, మాజీ కార్పొరేటర్ తుమ్మల రమేష్ రెడ్డి, కో-ఆప్షన్ సభ్యులు కన్న కృష్ణ, కెప్టెన్ మధుసూదన్ రెడ్డి, వెంకటేష్ తదితర నాయకులు, ఆలయ ప్రతినిధులు పాల్గొన్నారు.


Comments