ఎమ్మెల్సీ ఎన్నికల విజయమే లక్ష్యం.

పురుషోత్తం రెడ్డి బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు.

ఎమ్మెల్సీ ఎన్నికల విజయమే లక్ష్యం.

పెద్దమందడి,అక్టోబర్05(తెలంగాణ ముచ్చట్లు):

వనపర్తి జిల్లా పెద్దమందడి మండల కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో మండల అధ్యక్షుడు ముప్పూరి చెన్నయ్య ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మెంటపల్లి పురుషోత్తం రెడ్డి మాట్లాడుతూ.. మహబూబ్‌నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు పార్టీ శ్రేణులు సిద్ధం కావాలని సూచించారు.మండలంలోని అన్ని గ్రామాల్లో 01-11-2023 నాటికి డిగ్రీ పూర్తి చేసుకున్న పట్టభద్రులను గుర్తించి, ఓటరు నమోదు ప్రక్రియలో ఎన్రోల్ చేయించాలని బీజేపీ పెద్దమందడి నాయకులకు సూచించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి గెలుపే లక్ష్యంగా నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ గౌడ్, జిల్లా ఉపాధ్యక్షులు కొత్తకాపు శివారెడ్డి, రాఘవేందర్ గౌడ్, జిల్లా కార్యదర్శి కే. తిరుపతయ్య, మండల ప్రధాన కార్యదర్శి సుక్క మధు, మండల ఉపాధ్యక్షులు రాములు, సీనియర్ నాయకులు రిటైర్డ్ టీచర్ కృష్ణయ్య, యాదయ్య, రమేష్, చంద్రమౌళి, బీజేవైఎం మండల అధ్యక్షులు రవి, బూత్ అధ్యక్షులు బాలరాజు, చంద్రకళ తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

మామిడి తోటలో అడవి దున్న సంచారం. మామిడి తోటలో అడవి దున్న సంచారం.
వేంసూరు, అక్టోబరు 5(తెలంగాణ ముచ్చట్లు): వేంసూరు మండలం చౌడవరం గ్రామ సమీపంలోని మామిడి తోటలో అడవి దున్న సంచరిస్తూ కనిపించడంతో స్థానికంగా కలకలం రేగింది. తోటలో అడవి...
భూములిచ్చేది లేదు.. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ వద్దు!
ప్రజావాణిపై.. ప్రజల్లో సన్నగిల్లిన ఆశలు!
డిగ్రీ ఉంటే చాలదు.. స్కిల్స్ ఉంటేనే భవిష్యత్తు!
రెండేళ్లుగా కన్నీళ్లే.. ఇప్పటికీ పింఛను కరువే!
దేవాదాయ శాఖ స్పెషల్ డ్రైవ్ మీటింగ్ కారణంగా..
మండల విద్యాధికారికి పీఆర్టీయూ టీఎస్ ఘన సన్మానం.