55 ఏళ్లు దాటిన భవన నిర్మాణ కార్మికులకు రూ.6 వేల పెన్షన్ ఇవ్వాలి.

బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి బొబ్బిలి నిక్సన్ డిమాండ్.

55 ఏళ్లు దాటిన భవన నిర్మాణ కార్మికులకు రూ.6 వేల పెన్షన్ ఇవ్వాలి.

వనపర్తి,అక్టోబర్05(తెలంగాణ ముచ్చట్లు):

వెల్ఫేర్ బోర్డు ద్వారా 55 సంవత్సరాలు పైబడిన భవన నిర్మాణ కార్మికులకు నెలకు రూ.6 వేల పెన్షన్ అందించాలని తెలంగాణ బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి బొబ్బిలి నిక్సన్ డిమాండ్ చేశారు.సోమవారం వనపర్తి జిల్లా కేంద్రంలో భవన నిర్మాణ కార్మిక సంఘం టౌన్ కమిటీ సమావేశం టౌన్ కమిటీ అధ్యక్షుడు బాలస్వామి అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా నిక్సన్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయాలని, వెల్ఫేర్ బోర్డు నిధులను పూర్తిగా కార్మికుల సంక్షేమం కోసమే వినియోగించాలని కోరారు.వెల్ఫేర్ బోర్డు పథకాల అమలుకు సంబంధించి సీఎస్‌సీ సంస్థ నిర్వహిస్తున్న హెల్త్ టెస్టులను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కార్మికుల పిల్లలకు స్కాలర్‌షిప్‌లు అందించాలని కోరారు. భవన నిర్మాణ కార్మికులు ప్రతిరోజూ పనుల కోసం అడ్డాల వద్ద వేచి ఉంటారని, వారి కోసం ఆయా అడ్డాల్లో కనీస మౌలిక సదుపాయాలు కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు.ఈ సమావేశంలో టౌన్ కార్యదర్శి రాబర్ట్, జిల్లా ఉపాధ్యక్షులు కావలి చిన్న, వెంకటయ్య, పుల్లన్న, భాస్కర్, జి. శ్రీను, నాగరాజు, ధ్యారపోగు అంజి, వీరేందర్, రవి, మన్యం తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

మామిడి తోటలో అడవి దున్న సంచారం. మామిడి తోటలో అడవి దున్న సంచారం.
వేంసూరు, అక్టోబరు 5(తెలంగాణ ముచ్చట్లు): వేంసూరు మండలం చౌడవరం గ్రామ సమీపంలోని మామిడి తోటలో అడవి దున్న సంచరిస్తూ కనిపించడంతో స్థానికంగా కలకలం రేగింది. తోటలో అడవి...
భూములిచ్చేది లేదు.. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ వద్దు!
ప్రజావాణిపై.. ప్రజల్లో సన్నగిల్లిన ఆశలు!
డిగ్రీ ఉంటే చాలదు.. స్కిల్స్ ఉంటేనే భవిష్యత్తు!
రెండేళ్లుగా కన్నీళ్లే.. ఇప్పటికీ పింఛను కరువే!
దేవాదాయ శాఖ స్పెషల్ డ్రైవ్ మీటింగ్ కారణంగా..
మండల విద్యాధికారికి పీఆర్టీయూ టీఎస్ ఘన సన్మానం.