ఎస్‌జీఎఫ్‌లో రేడియంట్ స్కూల్ విద్యార్థుల సత్తా.
ఉమ్మడి జిల్లా స్థాయి పోటీలకు ముగ్గురు విద్యార్థుల ఎంపిక.
వనపర్తి,అక్టోబర్05(తెలంగాణ ముచ్చట్లు):
ఎస్‌జీఎఫ్ క్రీడా పోటీల్లో రేడియంట్ హైస్కూల్ విద్యార్థులు ప్రతిభ కనబరిచి ఉమ్మడి జిల్లా స్థాయి పోటీలకు ఎంపికైనట్లు సాహితీ కళావేదిక అధ్యక్షులు పలుస శంకర్ గౌడ్ తెలిపారు. అండర్–14 బాలుర విభాగంలో ఉప్పరి సాయి సాత్విక్ సాగర్, అండర్–17 విభాగంలో మేకల లోహిత్ యాదవ్, ఉప్పరి వివేక్ సాగర్ ఎంపికయ్యారని పేర్కొన్నారు.ఈ సందర్భంగా శంకర్ గౌడ్ మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని అన్నారు. క్రీడలు క్రమశిక్షణ, పట్టుదల, ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలను పెంపొందిస్తాయని తెలిపారు. క్రీడా ప్రతిభను ప్రోత్సహిస్తే ఉన్నత విద్యతో పాటు క్రీడా కోటా ద్వారా మంచి అవకాశాలు లభిస్తాయని పేర్కొన్నారు.ఉమ్మడి జిల్లా స్థాయికి ఎంపికైన విద్యార్థులను అభినందించిన శంకర్ గౌడ్, రాబోయే పోటీల్లో రాష్ట్ర, జాతీయ స్థాయిలో రాణించాలని ఆకాంక్షించారు. విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ అందించిన పీఈటీ మాస్టర్ వెంకటేష్‌ను అభినందించారు.ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ గద్దె కౌసల్య, పరవస్తు క్రియేటివ్ ఫౌండేషన్ రాష్ట్ర కోఆర్డినేటర్ గద్య భాస్కర్, ప్రిన్సిపల్ ఉప్పరి తిరుమలేష్, ఉపాధ్యాయులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


Comments