*అమెరికా నుంచి సుప్రియ మృతదేహం రప్పించేందుకు ఎంపీ రఘురాం రెడ్డి చొరవ.
* ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లిన ఎంపీ
* కేంద్ర విదేశాంగ శాఖ, అమెరికాలోని భారత రాయబార కార్యాలయ ఉన్నతాధికారులతో సంప్రదింపులు
* మృతురాలి కుటుంబ సభ్యులతో ఫోన్‌లో మాట్లాడి ఓదార్పు
ఖమ్మం బ్యూరో, అక్టోబర్ 5(తెలంగాణ ముచ్చట్లు )
అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని సింహాద్రినగర్‌కు చెందిన సుప్రియ మృతి చెందడం పట్ల ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాం రెడ్డి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఆమె మృతదేహాన్ని వీలైనంత త్వరగా స్వదేశానికి తీసుకొచ్చేందుకు ప్రత్యేక చొరవ తీసుకుని..ఈ విషయాన్ని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున అవసరమైన పూర్తి సహకారం అందేలా చర్యలు చేపట్టారు. హైదరాబాద్‌లోని ప్రొటెక్టర్ ఆఫ్ ఎమిగ్రెంట్స్ (పీఓఈ) ఉన్నతాధికారులతో మాట్లాడారు. అమెరికాలోని భారత రాయబార కార్యాలయ అధికారులకు సమాచారం అందించారు.
కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, అమెరికాలోని భారత రాయబార కార్యాలయ ఉన్నతాధికారులతో సంప్రదింపులు జరిపి.. సుప్రియ మృతదేహాన్ని వీలైనంత త్వరగా భారత్‌కు తీసుకొచ్చేలా చర్యలు చేపట్టాలని కోరారు. ఇందుకు అవసరమైన ప్రక్రియను వేగవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు.
*కుటుంబ సభ్యులకు ఫోన్‌లో పరామర్శ*
సింహాద్రినగర్‌లో నివాసం ఉంటున్న సుప్రియ తల్లిదండ్రులతో ఎంపీ రఘురాం రెడ్డి సోమవారం ఫోన్‌లో మాట్లాడారు. జరిగిన ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ.. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ కష్ట సమయంలో ధైర్యంగా ఉండాలని సూచించారు. సుప్రియ మృతదేహాన్ని త్వరితగతిన స్వదేశానికి తీసుకొచ్చేందుకు తన వంతు అన్ని ప్రయత్నాలు కొనసాగిస్తానని కుటుంబ సభ్యులకు భరోసా ఇచ్చారు.


Comments