చిన్నారుల ఆరోగ్యం, పౌష్టికాహారమే లక్ష్యం.
బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలు కవిత యాదవ్.
వనపర్తి,అక్టోబర్05(తెలంగాణ ముచ్చట్లు):
వనపర్తి జిల్లా బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలు కవిత యాదవ్ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని వివిధ అంగన్‌వాడీ కేంద్రాల్లో ‘అంగన్ మిలన్’ సేవా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. చిన్నారుల ఆరోగ్యం, పౌష్టికాహారం, ప్రాథమిక విద్యను ప్రోత్సహించడమే లక్ష్యంగా కార్యక్రమాన్ని చేపట్టారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ భావితరాలైన చిన్నారుల సంపూర్ణ ఎదుగుదలలో అంగన్‌వాడీ కేంద్రాల పాత్ర కీలకమని అన్నారు. గర్భిణులు, బాలింతలు, చిన్నారుల కోసం ప్రభుత్వం అందిస్తున్న పౌష్టికాహార పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో చిన్నారులతో ఆప్యాయంగా గడిపి వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. చిన్నారులకు సేవలందిస్తున్న అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆయాలను అభినందించారు.ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీ చైర్మన్ లోకనాథ్ రెడ్డి, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కేతూరి బుడ్డన్న, వనపర్తి జిల్లా ఎస్సీ మోర్చా అధ్యక్షులు గంధం ప్రవీణ్ కుమార్, బీజేపీ జిల్లా కార్యదర్శి సరోజ, నాగర్‌కర్నూల్ పార్లమెంట్ మాజీ కన్వీనర్ ప్రవీణ్ కుమార్, స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అంగన్‌వాడీ సిబ్బంది, చిన్నారులు పాల్గొన్నారు.


Comments