నాణ్యత లోపిస్తే సహించేది లేదు.

*దసరాలోగా అభివృద్ధి పనులు పూర్తి చేయాలి: యాదగిరి సునీల్ రావు.

నాణ్యత లోపిస్తే సహించేది లేదు.

కరీంనగర్, అక్టోబర్ 5(తెలంగాణ ముచ్చట్లు ):

కరీంనగర్ డివిజన్‌లో నూతనంగా చేపడుతున్న సీసీ రోడ్లు, డ్రైనేజీ నిర్మాణ పనులను బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, కరీంనగర్ నగర పాలక సంస్థ డిప్యూటీ మేయర్, మాజీ మేయర్ యాదగిరి సునీల్ రావు పరిశీలించారు.

ఈ సందర్భంగా సంబంధిత కాంట్రాక్టర్లు, అధికారులకు పనుల నాణ్యతపై పలు సూచనలు చేశారు. నిర్మాణ పనులు అత్యంత నాణ్యతతో చేపట్టాలని, ఎక్కడా నిర్లక్ష్యం వహించవద్దని ఆదేశించారు. రానున్న 15 నుంచి 20 ఏళ్ల వరకు ప్రజలకు ఇబ్బందులు కలగకుండా రోడ్లు, డ్రైనేజీలను పక్కాగా నిర్మించాలని సూచించారు.

డ్రైనేజీ కాలువల్లో నీరు నిల్వ ఉండకుండా సజావుగా ప్రవహించేలా స్లోప్‌లను సక్రమంగా ఏర్పాటు చేయాలని తెలిపారు. వర్షపు నీరు సులభంగా వెళ్లిపోయేలా ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.

దసరా పండుగలోగా అభివృద్ధి పనులన్నింటినీ వేగవంతంగా పూర్తి చేసి, ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా రోడ్లను అందుబాటులోకి తీసుకురావాలని యాదగిరి సునీల్ రావు సూచించారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

మామిడి తోటలో అడవి దున్న సంచారం. మామిడి తోటలో అడవి దున్న సంచారం.
వేంసూరు, అక్టోబరు 5(తెలంగాణ ముచ్చట్లు): వేంసూరు మండలం చౌడవరం గ్రామ సమీపంలోని మామిడి తోటలో అడవి దున్న సంచరిస్తూ కనిపించడంతో స్థానికంగా కలకలం రేగింది. తోటలో అడవి...
భూములిచ్చేది లేదు.. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ వద్దు!
ప్రజావాణిపై.. ప్రజల్లో సన్నగిల్లిన ఆశలు!
డిగ్రీ ఉంటే చాలదు.. స్కిల్స్ ఉంటేనే భవిష్యత్తు!
రెండేళ్లుగా కన్నీళ్లే.. ఇప్పటికీ పింఛను కరువే!
దేవాదాయ శాఖ స్పెషల్ డ్రైవ్ మీటింగ్ కారణంగా..
మండల విద్యాధికారికి పీఆర్టీయూ టీఎస్ ఘన సన్మానం.