ప్రజావాణిపై.. ప్రజల్లో సన్నగిల్లిన ఆశలు!

ప్రజావాణిపై.. ప్రజల్లో సన్నగిల్లిన ఆశలు!

పెండింగ్‌లో ఉన్న 50 దరఖాస్తులు ఎక్కడ?

15 రోజుల్లో సమస్యలు పరిష్కరించాలి

సీపీఎం మండల కార్యదర్శి సాధన రమేష్

చిల్పూర్,అక్టోబర్ 5 (తెలంగాణ ముచ్చట్లు): 

ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమం చిల్పూర్ మండలంలో తూతూమంత్రంగా మారిందని సీపీఎం మండల కార్యదర్శి సాధన రమేష్ ఆరోపించారు.మండల కేంద్రంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. గత ఐదు వారాలుగా ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమంలో పేదలు తమ సమస్యల పరిష్కారం కోసం దరఖాస్తులు అందజేస్తున్నారని తెలిపారు. ముఖ్యంగా ఇందిరమ్మ ఇళ్లు, పింఛన్లు, రేషన్ కార్డులు, భూ సమస్యలు, ఉపాధి హామీ బిల్లులకు సంబంధించిన సమస్యలపై సుమారు 50 దరఖాస్తులు అందాయని పేర్కొన్నారు.

అయితే ప్రజావాణికి దరఖాస్తులు ఇచ్చి ఐదు వారాలు గడుస్తున్నా ఇప్పటివరకు ఒక్క దరఖాస్తు కూడా పరిష్కారం కాలేదని ఆయన ఆరోపించారు. దీంతో ప్రజల్లో ప్రజావాణి కార్యక్రమంపై ఆశలు సన్నగిల్లుతున్నాయని అన్నారు.
ప్రజలు తమ సమస్యలు పరిష్కారమవుతాయనే నమ్మకంతో ప్రజావాణికి వస్తుంటే, దరఖాస్తులు పెండింగ్‌లో ఉండటం సరైన విధానం కాదని రమేష్ పేర్కొన్నారు. జిల్లా ఉన్నతాధికారులు వెంటనే స్పందించి సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించాలని డిమాండ్ చేశారు.
పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను 15 రోజుల్లోగా పరిష్కరించి, ప్రజలకు న్యాయం చేయాలని ఆయన కోరారు. ప్రజావాణి కార్యక్రమాన్ని మరింత సమర్థవంతంగా నిర్వహించి, దరఖాస్తుల పరిష్కారంపై అధికారులు స్పష్టమైన చర్యలు తీసుకోవాలని సీపీఎం మండల కార్యదర్శి సాధన రమేష్ డిమాండ్ చేశారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

మామిడి తోటలో అడవి దున్న సంచారం. మామిడి తోటలో అడవి దున్న సంచారం.
వేంసూరు, అక్టోబరు 5(తెలంగాణ ముచ్చట్లు): వేంసూరు మండలం చౌడవరం గ్రామ సమీపంలోని మామిడి తోటలో అడవి దున్న సంచరిస్తూ కనిపించడంతో స్థానికంగా కలకలం రేగింది. తోటలో అడవి...
భూములిచ్చేది లేదు.. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ వద్దు!
ప్రజావాణిపై.. ప్రజల్లో సన్నగిల్లిన ఆశలు!
డిగ్రీ ఉంటే చాలదు.. స్కిల్స్ ఉంటేనే భవిష్యత్తు!
రెండేళ్లుగా కన్నీళ్లే.. ఇప్పటికీ పింఛను కరువే!
దేవాదాయ శాఖ స్పెషల్ డ్రైవ్ మీటింగ్ కారణంగా..
మండల విద్యాధికారికి పీఆర్టీయూ టీఎస్ ఘన సన్మానం.