అప్పుల బాధతో వ్యక్తి పురుగుల మందు తాగి ఆత్మహత్య .
Views: 0
On
వేలేరు, అక్టోబర్ 5 (తెలంగాణ ముచ్చట్లు):
అప్పుల బాధతో మనస్తాపానికి గురైన కాశబోయిన కుమార్ అనే వ్యక్తి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన విషాద ఘటన వేలేరు మండలం కన్నారం గ్రామంలో చోటుచేసుకుంది. కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం.. అప్పుల కారణంగా కొంతకాలంగా కుమార్ తీవ్ర ఆందోళనకు గురవుతున్నట్లు తెలిసింది.
ఈ క్రమంలో సోమవారం పురుగుల మందు తాగిన కుమార్‌ను కుటుంబ సభ్యులు గుర్తించి వెంటనే చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం. అయితే పరిస్థితి విషమించడంతో మృతి చెందినట్లు తెలిసింది. ఘటనతో కన్నారం గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
05 Oct 2026 21:08:27
వేంసూరు, అక్టోబరు 5(తెలంగాణ ముచ్చట్లు):
వేంసూరు మండలం చౌడవరం గ్రామ సమీపంలోని మామిడి తోటలో అడవి దున్న సంచరిస్తూ కనిపించడంతో స్థానికంగా కలకలం రేగింది. తోటలో అడవి...


Comments