ఘనపూర్ ఎంపీడీవో కార్యాలయంలో హైడ్రామా..!

ఘనపూర్ ఎంపీడీవో కార్యాలయంలో హైడ్రామా..!

ఎంపీడీవో వేధింపులు భరించలేకపోతున్నాం.. 

కన్నీటి పర్యంతమైన మహిళా ఉద్యోగినులు

ఆరోపణల్లో వాస్తవం లేదు.. పని చేయమంటేనే వేధింపులా?

 – ఎంపీడీవో విజయశ్రీ

స్టేషన్ ఘనపూర్,అక్టోబర్ 5 (తెలంగాణ ముచ్చట్లు):

స్టేషన్ ఘనపూర్ మండల ప్రజా పరిషత్ (ఎంపీడీవో) కార్యాలయంలో మహిళా ఉద్యోగినులు, ఎంపీడీవో మధ్య వివాదం చర్చనీయాంశంగా మారింది. ఎంపీడీవో వేధింపులు తాళలేకపోతున్నామంటూ ఇద్దరు మహిళా ఉద్యోగినులు విలేకరుల ఎదుట కన్నీటి పర్యంతమయ్యారు.
కార్యాలయంలో పనిచేస్తున్న సీనియర్ అసిస్టెంట్ మయూరి, టైపిస్ట్ సంఘమిత్ర మాట్లాడుతూ.. గత ఆరు నెలలుగా తాము తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్నామని ఆరోపించారు. ‘‘కార్యాలయం మాకు నరకంగా మారింది. ప్రతిరోజూ ఏదో ఒక కారణంతో వివాదం సృష్టిస్తున్నారు. ప్రశాంతంగా విధులు నిర్వహించే పరిస్థితి లేకుండా పోయింది’’ అని ఆవేదన వ్యక్తం చేశారు.

కార్యాలయంలో పాత రికార్డులు, ఫైళ్లు సక్రమంగా లేకపోయినా వాటికి తమను బాధ్యులుగా చేస్తున్నారని వారు తెలిపారు. ప్రజాపాలనకు సంబంధించిన పెండింగ్ ఫైళ్లను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నప్పటికీ సంతకాల విషయంలో సరైన విధానం లేకపోవడం, అటెండర్, జూనియర్ అసిస్టెంట్లు తాము అడిగిన ఫైళ్లను అందించకపోవడం వల్ల పనుల్లో జాప్యం జరుగుతోందని పేర్కొన్నారు.గత సిబ్బంది నిర్వహణకు సంబంధించిన లోపాలను తమపై మోపడం సరికాదని, ఈ వ్యవహారంపై జిల్లా ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని విచారణ జరిపి తమకు న్యాయం చేయాలని మహిళా ఉద్యోగినులు కోరారు.


ఆరోపణలను ఖండించిన ఎంపీడీవో

మహిళా ఉద్యోగినులు చేసిన ఆరోపణలను ఎంపీడీవో విజయశ్రీ ఖండించారు. కార్యాలయ పనులను సకాలంలో పూర్తి చేయాలని మాత్రమే తాను సిబ్బందిని ఆదేశిస్తున్నానని తెలిపారు.‘‘వారు చేసిన ఆరోపణల్లో ఎలాంటి వాస్తవం లేదు. కార్యాలయ పనులు త్వరగా పూర్తి చేయాలని ఆదేశించాను తప్ప ఎవరినీ వ్యక్తిగతంగా వేధించలేదు. విధుల్లో భాగంగా పని విషయంలో ఒత్తిడి చేయడాన్నే వేధింపులుగా చిత్రీకరిస్తున్నారు’’ అని ఎంపీడీవో విజయశ్రీ స్పష్టం చేశారు.ఇరు వర్గాల మధ్య నెలకొన్న వివాదంపై ఉన్నతాధికారులు స్పందించి వాస్తవాలను పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాల్సి ఉంది.

Tags:

Post Your Comments

Comments

Latest News

మామిడి తోటలో అడవి దున్న సంచారం. మామిడి తోటలో అడవి దున్న సంచారం.
వేంసూరు, అక్టోబరు 5(తెలంగాణ ముచ్చట్లు): వేంసూరు మండలం చౌడవరం గ్రామ సమీపంలోని మామిడి తోటలో అడవి దున్న సంచరిస్తూ కనిపించడంతో స్థానికంగా కలకలం రేగింది. తోటలో అడవి...
భూములిచ్చేది లేదు.. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ వద్దు!
ప్రజావాణిపై.. ప్రజల్లో సన్నగిల్లిన ఆశలు!
డిగ్రీ ఉంటే చాలదు.. స్కిల్స్ ఉంటేనే భవిష్యత్తు!
రెండేళ్లుగా కన్నీళ్లే.. ఇప్పటికీ పింఛను కరువే!
దేవాదాయ శాఖ స్పెషల్ డ్రైవ్ మీటింగ్ కారణంగా..
మండల విద్యాధికారికి పీఆర్టీయూ టీఎస్ ఘన సన్మానం.