ప్రజా సమస్యలపై సర్పంచ్ ప్రత్యేక దృష్టి.
మార్నింగ్ వాక్‌లో వార్డుల సమస్యల గుర్తింపు
– సర్పంచ్ పలుస శ్రీనివాస్ గౌడ్
పెద్దమందడి,అక్టోబర్05( తెలంగాణ ముచ్చట్లు):
పెద్దమందడి మండలం మణిగిల్ల గ్రామ సర్పంచ్ పలుస శ్రీనివాస్ గౌడ్ మార్నింగ్ వాక్‌లో భాగంగా ఎస్సీ కాలనీలోని 6, 7వ వార్డుల్లో పర్యటించి ప్రజా సమస్యలను ప్రత్యక్షంగా పరిశీలించారు. వార్డుల్లో ప్రజలను కలిసి స్థానికంగా నెలకొన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా ఇళ్లపై నుంచి వెళ్తున్న విద్యుత్ వైర్లను పరిశీలించి, వాటి తొలగింపునకు చర్యలు తీసుకోవడంపై దృష్టి సారించారు. అదేవిధంగా వీధిలైట్ల పనితీరును పరిశీలించి, అవసరమైన ప్రాంతాల్లో కొత్త బల్బులను ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలిపారు.వార్డుల్లో రోడ్లు, డ్రైనేజీల పరిస్థితిని పరిశీలించిన సర్పంచ్, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా పారిశుధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు తెలిపారు.గ్రామంలో దోమల బెడద నివారణకు ఫాగింగ్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు సర్పంచ్ పలుస శ్రీనివాస్ గౌడ్ గ్రామ ప్రజలకు తెలియజేశారు. ప్రజలకు అవసరమైన మౌలిక వసతులు కల్పించడంతో పాటు, వార్డుల్లో గుర్తించిన సమస్యలను దశలవారీగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.ఈ కార్యక్రమంలో గ్రామ ఉపసర్పంచ్ గణేష్ కుమార్, వార్డు సభ్యులు తిరుపతమ్మ, బాలకృష్ణ, ముప్పూరి చెన్నయ్య, ముప్పూరి రాములు, కురుమయ్య, రమేష్, ముప్పూరి ఆనంద్, వెంకటయ్య, ముప్పూరి రాజు, రవికుమార్, ప్రవీణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.


Comments