ఓట్ల అక్రమాలపై కరీంనగర్‌లో ఇండియా కూటమి నిరసన.
సీఈసీ తొలగింపును డిమాండ్ చేస్తూ కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ.
కరీంనగర్, అక్టోబర్ 6(తెలంగాణ ముచ్చట్లు ):
కరీంనగర్: ప్రజాస్వామ్య పరిరక్షణలో భాగంగా కేంద్ర ఎన్నికల సంఘంపై పలు ఆరోపణలు చేస్తూ, ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌ను తొలగించాలని డిమాండ్ చేస్తూ కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ, ఇండియా కూటమి ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఇందిరా చౌక్ నుంచి కలెక్టరేట్ వరకు నాయకులు, కార్యకర్తలతో భారీ ర్యాలీ నిర్వహించారు.
అనంతరం కలెక్టరేట్ ఎదుట నిరసన చేపట్టి, ఎన్నికల ప్రక్రియలో అవకతవకలు, ఓట్ల అక్రమాలపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేస్తున్న పోరాటానికి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌ల దిష్టిబొమ్మలను దహనం చేశారు.
ప్రజాస్వామ్య పరిరక్షణకు సంబంధించిన డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని జిల్లా కలెక్టర్‌కు సమర్పించారు. ఈ కార్యక్రమంలో చొప్పదండి ఎమ్మెల్యే, కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మేడిపల్లి సత్యం, ఇండియా
కూటమి భాగస్వామ్య పార్టీల నాయకులు, కార్యకర్తలు, జిల్లా కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.


Comments